|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NTR-త్రివిక్రమ్ మాస్ కాంబో.. ‘గాడ్ ఆఫ్ వార్’ పోస్టర్ వైరల్! ఫ్యాన్స్‌కు పూనకాలే!

Published: 29-06-2026, 11:34 AM
NTR-త్రివిక్రమ్ మాస్ కాంబో.. 'గాడ్ ఆఫ్ వార్' పోస్టర్ వైరల్! ఫ్యాన్స్‌కు పూనకాలే!
  • జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్.
  • పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్: త్రిశూలం, యుద్ధ వాతావరణం, ‘వన్ స్పియర్’ క్యాప్షన్.
  • తారక్ పోస్ట్: “శివుడి పుత్రుడు.. ఎటర్నల్ కమాండర్.. మరోసారి త్రివిక్రమ్‌తో”.
  • ‘గాడ్ ఆఫ్ వార్’ టైటిల్ పై ఉత్కంఠ: త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో భారీ యాక్షన్.

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది! తారక్ పవర్ ఫుల్ పోస్టర్, క్యాప్షన్ తో సోషల్ మీడియాను షేక్ చేసాడు. ఈ మాస్ అప్డేట్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది.

తారక్ పోస్ట్.. సోషల్ మీడియా షేక్!

NTR Trivikram: జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో నెక్ట్స్ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ అయింది. తారక్ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఓ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

NTR Trivikram: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తన నెక్ట్స్ మూవీ గురించి వెల్లడించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తూ తారక్ అఫీషియల్ ట్వీట్ చేయడంతో మొత్తం సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయిపోయింది.

“శివుడి పుత్రుడు.. పార్వతి గర్వకారణం.. ఎటర్నల్ కమాండర్.. మరోసారి త్రివిక్రమ్‌తో” అంటూ తారక్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

‘గాడ్ ఆఫ్ వార్’ పోస్టర్ లో ఏముంది?

అరవింద సమేత తర్వాత మళ్లీ అదే క్రేజీ కాంబో

తారక్ హింట్ ఇచ్చిన ఆ పవర్‌ఫుల్ లైన్స్ వెనుక కథ ఏంటి?

క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!

తాజాగా వచ్చిన పోస్టర్ లో ఓ త్రిశూలాన్ని చూడొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ లో యుద్ధ వాతావరణం, శవాలు, మంటలు చూస్తుంటే.. చాలా ఇంటెన్స్ గా కనిపిస్తోంది. వన్ స్పియర్ వన్ పర్పస్ వన్ డివైన్ రెకనింగ్ (ఒక ఈటె, ఒక లక్ష్యం, ఒక దైవిక లెక్క) అనే పవర్ ఫుల్ లైన్స్ ఆ పోస్టర్ పై చూడొచ్చు.

త్రివిక్రమ్ మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎన్టీఆర్ రేంజ్ మాస్ పర్ఫార్మెన్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. ఈ సినిమాకు తాత్కాలికంగా NTRxTrivikram అనే టైటిల్ పెట్టారు. అయితే గాడ్ ఆఫ్ వార్ అంటూ చాలా రోజులుగా వస్తున్న టైటిలే ఖరారు చేస్తారా లేక మరేదైనా పెడతారా అన్నది చూడాలి.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో ఈ సినిమా అంచనాలను మించి ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. టైటిల్, ఇతర వివరాల కోసం వేచి చూడండి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం ట్యూన్ అయి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.