
బాలీవుడ్ చిత్రం ‘వార్-2’లో నటిస్తున్న ఎన్టీఆర్, షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హృతిక్ రోషన్, దర్శకుడు అయాన్ ముఖర్జీ గురించి ఎన్టీఆర్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.
Key Points
ఎన్టీఆర్ 'వార్-2' షూటింగ్ పూర్తి చేశాడు.
హృతిక్ రోషన్‌తో పనిచేయడం గురించి ఎన్టీఆర్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.
ఆగస్టు 14న 'వార్-2' గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్.
ఎన్టీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘వార్-2’ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘వార్-2’లో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ YRF నిర్మాణంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రతీ అప్డేట్ ఆకట్టుకోగా.. ఇటీవల వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. దీంతో వార్-2పై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ పూర్తయింది అంటూ స్పెషల్ ట్వీట్ చేశాడు. ‘వార్ 2 షూటింగ్ పూర్తయింది. దీని నుంచి చాలా తీసుకున్నాను. హృతిక్ సర్‌తో సెట్‌లో ఉండటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. వార్ 2 జర్నీలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. డైరెక్టర్ అయాన్ ఒక అద్భుతం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఒక పెద్ద సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌ని తయారుచేస్తున్నారు. YRF సంస్థకు, సిబ్బందికి ధన్యవాదాలు. ఆగస్టు 14 న మీరు ఈ సినిమాని చూసేదాకా వేచిఉండలేను’ అని తెలిపారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవ్వగా ఫ్యాన్స్ వార్ 2పై ఫ్యాన్స్‌లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. లింక్
ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్
ఎన్టీఆర్ యొక్క ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ‘వార్-2’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


