|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ విధ్వంసం: ట్రోలర్స్‌కి వార్నింగ్, బాక్సాఫీస్ బద్దలే టార్గెెట్! ఫైర్

Published: 13-04-2026, 3:35 AM
ఎన్టీఆర్ విధ్వంసం: ట్రోలర్స్‌కి వార్నింగ్, బాక్సాఫీస్ బద్దలే టార్గెెట్! ఫైర్
  • దేవర సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’!
  • జిమ్ లో కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్.. ట్రోలర్స్ కి దిమ్మతిరిగే రిప్లై!
  • వార్ 2 మూవీ టైం నుంచి ఎన్టీఆర్ ఫిజిక్ పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టిన తారక్!
  • మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ చిత్రం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన లేటెస్ట్ ఫోటోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. దేవర సక్సెస్ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కోసం ఎన్టీఆర్ కఠోరంగా శ్రమిస్తున్నాడు.

ట్రోల్స్ కి ఒక్క ఫోటోతో సమాధానం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సక్సెస్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ అనే మూవీ భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. మాస్ యాక్షన్ చిత్రాలకు ప్రశాంత్ నీల్ పెట్టింది పేరు. ఇక ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అలాంటి వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ మూవీ ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే ఆసక్తి పెరిగిపోతోంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే కొంతకాలంగా(వార్ 2 మూవీ టైం నుంచి) ఎన్టీఆర్ ఫిజిక్, లుక్స్ పై విమర్శలు వస్తున్నాయి.

ప్రశాంత్ నీల్ మూవీ కోసం తారక్ ట్రాన్స్ఫర్మేషన్!

సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. ఇటీవల తారక్ బయట కొన్ని ఈవెంట్స్ లో కనిపించినప్పుడు ముఖం బాగా పీల్చుకుపోయినట్లు అనిపించింది. దీనితో తారక్ తన బెస్ట్ లుక్ కోల్పోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఆ విమర్శలకు, ట్రోలర్స్ కి తారక్ ఒక్క దెబ్బతో సమాధానం ఇచ్చారు. తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో తన జిమ్ వర్కౌట్ ఫోటో షేర్ చేశారు. ఈ ఫొటోలో తారక్ వెనుక నుంచి కండలు తిరిగిన దేహంతో ఉక్కు మనిషిలా కనిపిస్తున్నాడు. తారక్ ఫిట్నెస్ లెవల్స్ ఎలా ఉన్నాయో ఈ ఫోటో చూస్తే అర్థం అవుతుంది.

బాక్సాఫీస్ ని షేక్ చేసే బాడీ!

తన బాడీ పై వస్తున్న ట్రోల్స్ కి ఎన్టీఆర్ ఈ ఫోటో తో సమాధానం ఇచ్చినట్లు అయింది. బాక్సాఫీస్ నిస్ షేక్ చేసే బాడీలా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రశాంత్ నీల్ మూవీ కోసమే తారక్ ఎలా తన ఫిజిక్ మార్చుకుంటున్నాడు. ఈ ఫోటోకి తారక్ ఇచ్చిన క్యాప్షన్ ఇంకా ఆసక్తికరంగా ఉంది. ఇది కష్టపడి తయారు చేసుకున్నది.. కొన్నది కాదు అనే క్యాప్షన్ పెట్టి ట్రోలర్స్ కి ఇచ్చిపడేశాడు.

A post shared by Jr NTR (@jrntr)

ఎన్టీఆర్ తన ఫిజిక్ తో ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం మరింత కష్టపడుతున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.