
📌 Key Points
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో తమిళ స్టార్ గురు సోమసుందరం ఎంట్రీతో అంచనాలు రెట్టింపు!
- గురు సోమసుందరం ‘రావు’ పాత్రలో కనిపించనున్నాడు, ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్.
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల.
- మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం.
ఎన్టీఆర్ అభిమానులకు పండగే! ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుకుంటున్న తరుణంలో, చిత్ర యూనిట్ మరో సంచలన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఓ తమిళ స్టార్ నటుడు ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాడు. ఆ వివరాలు తెలుసుకుందాం!
‘డ్రాగన్’లో గురు సోమసుందరం పాత్ర ఇదే!
తమిళం, మలయాళం, అండ్ దక్షిణ భారత భాషల్లో విభిన్న పాత్రలు పోషిస్తు ప్రముఖ సపోర్టింగ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు గురు సోమసుందరం.. ప్రస్తుతం ‘డిమాంటి కాలనీ 3’ వంటి చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈయన ఇప్పుడు డ్రాగన్‌లో కూడా భాగం అయ్యాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చెయ్యగా.. నెట్టింట సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా తమిళ నటుడు గురు సోమసుందరం ఇందులో రావు పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ రివీల్ చేశారు. కాగా.. మైత్రీ మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందుమూరి కల్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. జూన్ 11న పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది.
ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో భారీ అంచనాలు
జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
‘డ్రాగన్’ చిత్రంపై రోజురోజుకు పెరుగుతున్న ఈ ఉత్సాహం, విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి!


