
📌 Key Points
- ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ జరుపుకుంటోంది.
- ప్రధాన పాత్రల మధ్య సీన్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు.
- ‘డ్రాగన్’ అనే టైటిల్ తో సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయనున్నారు.
- మేకింగ్ క్వాలిటీ, చిన్న డిటైలింగ్ విషయంలో ప్రశాంత్ నీల్ రాజీ పడడం లేదు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని భారీ సెట్ లో యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే టాకీ పార్ట్ పూర్తికానుందని సమాచారం.
హైదరాబాద్ లో ‘NtrNeel’ కొత్త షెడ్యూల్
డ్రాగన్ కోసం యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్
హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్
కీ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్న దర్శకుడు
ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ప్లాన్
NtrNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సాలార్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అందుకే, ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇంటర్నేషనల్ లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
తన అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్ కి మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్(NtrNeel). అందుకే, మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. మైత్రి మూవీ సంస్థ కూడా ఈ సినిమాను చాలా ప్రెస్టిజియస్ గా తీసుకున్నారు. రీసెంట్ గా నిర్మాత రవి కూడా ఈ సినిమాపై కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. చిన్న చిన్న డిటైలింగ్ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ అవడం లేదట ప్రశాంత్ నీల్.
ఇంటర్నేషనల్ స్థాయిలో ‘డ్రాగన్’ టైటిల్
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా క్వాలిటీ ఉండేలా చేసుకుంటున్నాడట. దీంతో నిర్మాత రవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో మొదలయ్యింది. ఈ షెడ్యూల్ లో ప్రధాన పాత్రల మధ్య కొన్ని సీన్స్ తెరకెక్కించనున్నాడట. అలాగే ఎన్టీఆర్ తో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించనున్నాడట.
ఈ షెడ్యూల్ తరువాత మరోసారి విదేశాలకు వెళ్లనున్నాడు ఎన్టీఆర్. అక్కడ జరిగే షెడ్యూల్ తో మూవీ టాకీ పార్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవల్లో సెట్ అయ్యేలా ‘డ్రాగన్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. అంతేకాదు, ప్రశాంత్ నీల్ గత సినిమాల్లో లాగా కేవలం హీరో, ఎలివేషన్స్ మాత్రమే కాకుండా ఎమోషన్స్ కి కూడా ఈ సినిమాలో పెద్ద పీట వేశాడట దర్శకుడు.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న ఈ చిత్రం ‘డ్రాగన్’ పేరుతో అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అంచనాలకు మించి, మేకింగ్ క్వాలిటీతో ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచడం ఖాయం.


