|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ వింత సెంటిమెంట్లు: షాకింగ్ నిజాలు లీక్! మాస్ మహారాజు సీక్రెట్స్ వైరల్!

Published: 27-05-2026, 5:01 PM
ఎన్టీఆర్ వింత సెంటిమెంట్లు: షాకింగ్ నిజాలు లీక్! మాస్ మహారాజు సీక్రెట్స్ వైరల్!
  • నటసార్వభౌముడి 103వ జయంతి సందర్భంగా బయటపడ్డ రహస్యాలు.
  • ప్రతిరోజు ఉదయం 3 గంటలకు నిద్రలేచి ఇసుకతో వ్యాయామం.
  • మేకప్, వస్త్రధారణ విషయంలో రామారావు కఠినమైన సెంటిమెంట్.
  • ఆయుర్వేద వైద్యుడి సలహా మేరకు ప్రత్యేక ఆహార నియమాలు పాటించిన ఎన్టీఆర్.

విశ్వ నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి! ఆయన సినీ కెరీర్‌లో, రోజువారీ జీవితంలో పాటించిన వింత సెంటిమెంట్లు, కఠినమైన నియమాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ షాకింగ్ నిజాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు!

ఎన్టీఆర్ రోజువారీ దినచర్య: షాకింగ్ నిజాలు!

విశ్వ నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 103వ జయంతి ఈ గురువారం. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎవరికీ తెలియని విషయాలు బయటకు వచ్చాయి. అందులో భాగంగా రామారావు వింత సెంటిమెంట్లు తెలిశాయి. ఎన్టీఆర్‌ హీరోగా రాణించే క్రమంలో కొన్ని విచిత్రమైన ఆచారాలు ఫాలో అయ్యేవాడట. ఆ ఆచారాలు ఏంటో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. ఎన్టీఆర్‌ రోజువారి దిన చర్యలో భాగంగా ఈ విచిత్రమైన ఆచారాలను పాటించేవారట.

ఎన్టీఆర్‌ టాలీవుడ్‌ లో తిరుగులేని టాప్‌ స్టార్‌గా రాణించారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు తిరుగులేని స్టార్‌గా రాణించారు. ఆయన దిన చర్య ఎలా ఉండేదనేది చాలా మందికి తెలిసిందే, ఎన్టీఆర్‌ ఉదయాన్నే మూడు గంటలకు నిద్ర లేస్తారని, ఆ టైమ్‌లో జిమ్ములు, గిమ్ములు లేవు, దీంతో తన ఇంటి వద్ద ఒక బండి ఇసుక ఉండేదట. ఉదయం లేవగానే గోచి కట్టి, ఆ ఇసుకని ఇటు వైపు నుంచి అటు పారతో కుప్పపోసేవారట. దీంతో చెమట కారిపోయేది, ఫ్రీ అయిపోయేవాడట. కొన్నిసార్లు వాహిని వారి పహిల్వాన్‌ వస్తాడట. అతను రామారావుకి మసాజ్‌ చేస్తాడట. ఒళ్లంతా మసాజ్‌ చేయడంతో రిలీఫ్‌ అవుతారని, రెట్టింపు ఉత్సాహం వస్తుందట. అదే సమయంలో నిగనిగలా మెరుస్తాడట రామారావు.

ఆయన వింత సెంటిమెంట్లు: ఎవరికీ తెలియనివి

అది అయిపోయాక స్నానం చేసి, తెల్లటి దుస్తులు కట్టుకొని బయటకు వస్తాడట. నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆరోజు చేయబోయే స్క్రిప్ట్ లకు సంబంధించిన చర్చలు జరుగుతాయట. ఆ సీన్లు వినడం, వాటిలో ఏదైనా మార్పులు ఉంటే చెప్పడం జరుగుతుందట. ఆ తర్వాత మేకప్‌ ఆర్టిస్ట్ వస్తాడట. అతను పీతాంబరం అసిస్టెంట్‌, పేరు ముత్తు. ఆయన వచ్చి రామారావుకి బొట్టు పెడతాడట. అంతే ఆ తర్వాత రామారావే స్వయంగా మేకప్‌ వేసుకుంటాడట. తనకు నచ్చినట్టు, పాత్రకి తగ్గట్టుగా ఆయన ఈ మేకప్‌ వేసుకుంటాడట. అందుకే కొన్నిసార్లు మేకప్‌ ఓవర్‌గా కనిపిస్తుందని, దానికి కారణం ఆయనే స్వయంగా వేసుకోవడం అని తెలిపారు సీనియర్‌ జర్నలిస్ట్, రైటర్‌ ఇమ్మంది రామారావు.

అనంతరం మూకా రామారావు అనే ఒక కాస్ట్యూమ్‌ ఆర్టిస్ట్ ఉండేవాడట. ఆయనే ఎన్టీఆర్‌కి బట్టలు తొడగాలట. మరొకరు తొడిగితే ఊరుకునేవారు కాదట. జీవితాంతం అది కొనసాగించారట. ఒకటి ఆ కాస్ట్యూమర్‌ తొడగాలి, లేదంటే స్వయంగా ఎన్టీఆరే వేసుకోవాలి. ఈ సెంటిమెంట్‌ని రామారావు బాగా పాటించేవారట. అనంతరం ఫుడ్‌ తీసుకునేవారట. మార్నింగ్‌ డజన్‌ ఇడియప్పం, ఒక డజన్‌ మేకకాళ్ల రసం(పాయ) తింటాడట. తర్వాత కౌజు, ఇతర పక్షుల మాంసం తింటాడట. ఓ ఆయుర్వేద వైద్యుడి సలహా మేరకు ఆయన సూచించిన పక్షుల మాంసం తినేవాడట రామారావు. దాని వల్ల శక్తి బాగా వస్తుందట. అలా రోజూ రెండు కేజీలు తింటాడట.

మేకప్ నుండి భోజనం వరకు: ప్రత్యేక నియమాలు

అనంతరం ఆరు నుంచి ఏడు గంటల వరకు తనతో సినిమాలు చేయాలనుకునేవారితో మాట్లాడేవారట. ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు టూరిస్ట్ బస్సుల్లో వచ్చిన వారిని కలిసేవారట. ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు షూటింగ్‌ సెట్‌లో ఉండేవారట. అయితే షూటింగ్‌కి వెళ్లేముందు కచ్చితంగా బసవతారకం గారు ఎదురుగా రావాల్సిందేనట. ఆమె ఆరోగ్యం బాగా లేకపోయినా, ఎదురు వచ్చి హారతి ఇవ్వాల్సిందేట. అదే సమయంలో బూతాల రాజు వచ్చి దిష్టి తీసేవాడట. ఈ సెంటిమెంట్‌ని రామారావు కచ్చితంగా ఫాలో అవుతాడట రామారావు. 9 గంటలకు షూటింగ్‌ స్టార్ట్ చేస్తే, 1 గంటల వరకు కంటిన్యూగా షూటింగ్‌ చేస్తాడట. మధ్యలో గంట బ్రేక్‌. మళ్లీ 2 గంటల నుంచి 5 గంటల వరకు షూటింగ్‌ చేస్తాడట.

ఆరు తర్వాత సాయంత్రం దోసలు, మిర్చీలు, జిలేబీ తినేవాడట. అవి తిని ఇంటికెళ్లి మళ్లీ దిష్టి తీసుకుంటాడట. రాత్రి మళ్లీ రేపటి షూటింగ్‌లకు సంబంధించిన చర్చ ఉంటుందట. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు నిద్ర పోయేవాడట. ప్రపంచం అల్లకల్లోలం అయినా 9కి ఆయన నిద్ర పోయేవాడట. మళ్లీ ఉదయం మూడుగంటలకు నిద్ర లేచేవాడట. ఇలా రామారావు వ్యక్తిగతంగా ఒకే వ్యక్తి తనకు బొట్టు బెట్టడం, ఒకే వ్యక్తి తనకు డ్రెస్‌ తొడగడం, దిష్టి తీయడం, తన భార్య ఎదురుగా రావడం వంటి సెంటిమెంట్లని రామారావు కచ్చితంగా ఫాలో అయ్యేవారని ఇమ్మంది రామారావు వెల్లడించారు.

నందమూరి తారక రామారావు గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ వింత సెంటిమెంట్లు ఆయన క్రమశిక్షణకు, నమ్మకానికి నిదర్శనం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఎవరికీ తెలియని విషయాల కోసం మా పేజీని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.