
నూబియా నియో 5 మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ భారీ 7.5-అంగుళాల డిస్‌ప్లే, శక్తివంతమైన 7000mAh బ్యాటరీతో గేమింగ్ ప్రియులను ఆకట్టుకోనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్, గేమింగ్ ట్రిగ్గర్‌లతో ఈ ఫోన్ మల్టీమీడియా, గేమింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తుంది.
Key Points
7.5-అంగుళాల 1.5K ఎల్‌సీడీ డిస్‌ప్లే, నూబియా ఫోన్లలో ఇదే అతిపెద్దది.
మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్, 7000mAh భారీ బ్యాటరీ.
గేమర్ల కోసం ప్రత్యేకంగా షోల్డర్ ట్రిగ్గర్‌లు, ఆండ్రాయిడ్ 16 OS.
ప్రపంచ మార్కెట్లలో విడుదల కానున్న ఈ ఫోన్ ధర ఇంకా వెల్లడి కాలేదు.
నూబియా నియో 5 మ్యాక్స్: డిస్‌ప్లే, డిజైన్
Nubia Neo 5 Max : సూపర్ ఫోన్ భయ్యా.. టాబ్లెట్‌కు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో భారీ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌ను నుబియా లాంచ్ చేసింది. ఈ కంపెనీ 7.5-అంగుళాల బిగ్ డిస్‌ప్లేతో నుబియా నియో 5 మ్యాక్స్‌ను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ లార్జ్ ఫోన్ 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎల్‌సీడీ ప్యానెల్ కూడా ఉంది.
మోడ్రాన్ స్మార్ట్‌ఫోన్‌లలో అతిపెద్ద స్క్రీన్ ఫోన్ ఉందంటే ఇదే మోడల్ అని చెప్పొచ్చు. కేవలం డిస్‌ప్లే సైజ్ చూస్తేనే తెలుస్తుంది.. గేమింగ్, మూవీలు, మల్టీమీడియాకు అద్భుతంగా ఉంటుంది. బిగ్ స్క్రీన్ కోరుకునే యూజర్ల కోసం కంపెనీ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా తయారుచేసింది. రాబోయే ఈ నూబియా ఫోన్ ఫీచర్లు, ధర వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
ప్రాసెసర్, బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
Read Also : HMD Asha 305 Leak : నోకియా లవర్స్‌కు పండగే.. 14 ఏళ్ల తర్వాత ఆశా 305 ఫోన్ రీఎంట్రీ.. HMD కొత్త స్టైల్ అదిరిందిగా..!
ధర, లభ్యత : నుబియా నియో 5 మ్యాక్స్ ధర ఇంకా వెల్లడి కాలేదు. ఈ బ్రాండ్ చైనాలోని MWC షాంఘై 2026లో ఆవిష్కరించింది. కంపెనీ నియో 5 సిరీస్, గేమింగ్ మల్టీమీడియా ఎక్స్ పీరియన్స్ కోసం కంపెనీ తీసుకొస్తోంది.
ధర, లభ్యత వివరాలు
నుబియా నియో 5 మాక్స్ స్పెసిఫికేషన్లు : నూబియా నియో 5 మ్యాక్స్‌లో 7.5-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఈ కంపెనీ ఫోన్లలో ఇదే అతిపెద్ద డిస్‌ప్లే. 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసింగ్ కోసం కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్ అందిస్తోంది. గేమింగ్ కోసం మిడ్-రేంజ్ చిప్‌సెట్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో 7000mAh బ్యాటరీని అమర్చగా ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. గతంలో మాదిరిగా కంపెనీ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా గేమర్‌ల కోసం అందిస్తోంది. అందుకే ఇందులో షోల్డర్ ట్రిగ్గర్‌లు ఉన్నాయి. మొత్తం మీద, గేమింగ్ ఫోన్ కోరుకునే యువ యూజర్ల కోసం కంపెనీ ఈ ఫోన్ అందిస్తోంది. ఆసక్తికరంగా, ఈ ఫోన్ చైనాలో లాంచ్ కాకుండా ఇతర మార్కెట్లలోనూ లాంచ్ కానుంది.
మొత్తంగా, నూబియా నియో 5 మ్యాక్స్ యువ గేమర్‌లకు, పెద్ద స్క్రీన్ కోరుకునే వారికి అద్భుతమైన ఎంపిక. దీని భారీ డిస్‌ప్లే, బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి. ధర వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.


