
మీరు అక్టోబర్ నెలలో పుట్టారా? అయితే ఈ నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వం, లక్షణాలు తెలుసుకోండి. వీరు భావోద్వేగాలను నియంత్రించుకుంటూ, నిజాయితీగా ఉంటూ, లక్ష్యాలను సాధిస్తారు. శుక్రుడి ప్రభావంతో ధనవంతులై విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని ఈ కథనం వివరిస్తుంది.
Key Points
పూర్తి భావోద్వేగ నియంత్రణ కలిగి ఉంటారు, కోపాన్ని బయటపెట్టరు.
నిజాయితీగా ఉంటారు, సంబంధాలలో సంతోషానికి ప్రాధాన్యత ఇస్తారు.
లక్ష్యాలను సాధించి విజయం అందుకుంటారు, మంచి నాయకులుగా ఎదుగుతారు.
శుక్రుడి ప్రభావంతో ధనవంతులై విలాసవంతమైన జీవితం గడుపుతారు.
భావోద్వేగ నియంత్రణ, నిజాయితీ
పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలని చెప్పవచ్చు. పుట్టిన నెల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందని చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పచ్చు. హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ చాలా కీలకమైనది. అక్టోబరు నెలలోనే దసరా పండుగ వస్తుంది. పైగా అక్టోబర్ నెలలో పుట్టిన వారు భిన్నమైన లక్షణాలని కలిగి ఉంటారు. అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కూడా అక్టోబర్‌లో పుట్టారా? అయితే మీ గురించి మీరు తెలుసుకోవచ్చు.
అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ల గొప్పదనం ఏంటంటే ఎప్పుడూ కూడా భావోద్వేగాలపై పూర్తి నియంత్రణతో ఉంటారు. కోపాన్ని బయటకు చూపించరు. కోపాన్ని బయటకు చూపించకుండా ఎంతో సహనంగా ఉంటారు. ఎప్పుడు నిజమే మాట్లాడతారు. మోసం జరిగినా సహించలేరు.
అక్టోబర్ నెలలో పుట్టిన వారు భాగస్వామితో కలిసి సంతోషంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ నెలలో పుట్టిన వారు ఎవరితోనైనా ప్రేమలో పడితే దానిని బయటకు చెప్పేస్తారు, లోలోపలే దాచుకోరు. ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు. భాగస్వామి నుంచి కూడా అదే ఆశిస్తారు. ఎక్కువ ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడతారు.
విజయ రహస్యాలు, నాయకత్వ లక్షణాలు
అక్టోబర్ నెలలో పుట్టిన వారు విజయాలను అందుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. లక్ష్యాలను సాధించడానికి ఎల్లప్పుడూ ముందే ఉంటారు. మీరు సానుకూల ఆలోచనలతో సులభంగా విజయాన్ని అందుకుంటారు. కష్ట సమయంలో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారు. మంచి టీం లీడర్‌గా ఎదుగుతారు.
అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఎప్పుడు కూల్‌గా ఉంటారు. ఎక్కువ మిత్రులు ఉంటారు. ఎప్పుడూ కలల ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడతారు. ఎవరైనా వారి గురించి చెడుగా మాట్లాడినా, చెడుగా ప్రవర్తించినా ఎంతో బాధ పడతారు.
శుక్రుడి ప్రభావంతో విలాసవంతమైన జీవితం
శుక్రుడు ప్రభావంతో ఈ నెలలో పుట్టిన వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బుకి లోటు ఉండదు. ఎక్కువ ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్లు చాలా మృదువుగా మాట్లాడతారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఎక్కువ పాపులర్ అవుతూ ఉంటారు. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్ వంటి వారు కూడా అక్టోబర్‌లోనే పుట్టారు.
మొత్తంగా, అక్టోబర్ నెలలో పుట్టిన వారు అనేక మంచి లక్షణాలను కలిగి ఉంటారు. వారు సహనం, నిజాయితీ, నాయకత్వ లక్షణాలతో విజయం సాధించి, శుక్రుడి అనుగ్రహంతో డబ్బుకు లోటు లేకుండా సంతోషంగా జీవిస్తారు. ఈ గొప్పదనం వారి సొంతం.


