|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓజీ @ రూ.154 కోట్లు.. తొలి రోజే పవన్ కల్యాణ్ రికార్డుల ఊచకోత.. అధికారికంగా అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్స్

Published: 26-09-2025, 8:57 AM
ఓజీ @ రూ.154 కోట్లు.. తొలి రోజే పవన్ కల్యాణ్ రికార్డుల ఊచకోత.. అధికారికంగా అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్స్

పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్లు వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. నాన్-పాన్-ఇండియా చిత్రాల విభాగంలో అత్యధిక ఓపెనింగ్‌ను సొంతం చేసుకొని పవన్ కల్యాణ్ స్టామినాను నిరూపించింది.

Key Points

1

'ఓజీ' తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

2

నాన్-పాన్-ఇండియా చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్‌ను సొంతం చేసుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది.

4

'యానిమల్', 'జవాన్', 'లియో' వంటి పెద్ద చిత్రాల మొదటి రోజు కలెక్షన్లను ఓజీ అధిగమించింది.

ఓజీ ప్రపంచవ్యాప్త బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు

‘ఓజీ’ సినిమా వరల్డ్‌వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 1: పవన్ కల్యాణ్ ‘ఓజీ’తో చరిత్ర సృష్టించాడు. సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్‌ను సొంతం చేసుకున్న ఓ నాన్-పాన్-ఇండియా సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల మార్కును దాటింది.

‘ఓజీ’ సినిమా ప్రపంచవ్యాప్త కలెక్షన్

పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన ఓజీ ఊహించినట్లే సరికొత్త చరిత్రకు నాంది పలికింది. బాక్సాఫీస్ దగ్గర మంచి స్టార్ట్ తీసుకుంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్లు వసులు చేసినట్లు మూవీ నిర్మాణ సంస్థ అయిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అనౌన్స్ చేసింది.

రికార్డులు బద్దలు కొట్టిన పవన్ కల్యాణ్ ఓజీ

“ఇదీ పవన్ కల్యాణ్ సినిమా.. ఓజీ చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్త తొలి రోజు గ్రాస్ రూ.154 కోట్లు” అనే క్యాప్షన్ తో ఓ ట్వీట్ చేసింది. దీనికి మూవీలోని ఓ పవర్ ఫుల్ పవన్ కల్యాణ్ పోస్టర్ ను జోడించింది. ఇప్పటి వరకూ ఓ పాన్ ఇండియా సినిమాకు తప్ప కేవలం తెలుగు సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. కూలీ, జవాన్ లాంటి సినిమాలను కూడా ఓజీ వెనక్కి నెట్టింది.

ట్రేడ్ ట్రాకర్ sacnilk రిపోర్ట్ ప్రకారం ఈ ఓజీ సినిమా పెయిడ్ ప్రివ్యూస్‌లో ఇండియాలో రూ.20.25 కోట్ల నెట్ సంపాదించింది. దానికి తోడు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రూ.70.75 కోట్లు కలిపి దీని డొమెస్టిక్ ఓపెనింగ్ రూ.91 కోట్ల నెట్‌కు (రూ.100 కోట్లకు పైగా గ్రాస్) చేరింది.

ట్రేడ్ సోర్స్‌ల అంచనా ప్రకారం ఈ సినిమా నార్త్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఆసియాలో బాగా డబ్బు సంపాదించింది. ఎందుకంటే యూఎస్‌లో కేవలం పెయిడ్ ప్రీమియర్‌లతో 3 మిలియన్ డాలర్లు (రూ.26 కోట్లు) వసూలు చేసింది. దీని ఓవర్సీస్ ఓపెనింగ్ గ్రాస్ సుమారు 6 మిలియన్ డాలర్లు (రూ.50 కోట్లు) అని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్ల ఓపెనింగ్‌ను సాధించింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ టాప్ 10 ఓపెనర్లలో ‘ఓజీ’ 7వ స్థానంలో ఉంది.

టాప్ బ్లాక్‌బస్టర్‌లను వెనక్కి నెట్టిన ఓజీ

‘ఓజీ’ బ్లాక్‌బస్టర్‌లను ఇలా దాటింది

ప్రస్తుతానికి ఈ ‘ఓజీ’ మూవీ.. యానిమల్ (రూ.116 కోట్లు), జవాన్ (రూ.128 కోట్లు), లియో (రూ.143 కోట్లు), కూలీ (రూ.153 కోట్లు) లాంటి పెద్ద బ్లాక్‌బస్టర్‌ల మొదటి రోజు కలెక్షన్లను సులభంగా దాటిందని స్పష్టమైంది. అంటే రణ్‌బీర్ కపూర్, షారూఖ్ ఖాన్, విజయ్, రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ బిగ్గెస్ట్ ఓపెనింగ్‌లను పవన్ కల్యాణ్ బ్రేక్ చేశాడు.

అయితే ఇది సలార్ (రూ.158 కోట్లు), కేజీఎఫ్ ఛాప్టర్ 2 (రూ.159 కోట్లు) లను కొంచెం వెనక్కి నెట్టలేకపోయింది. లిస్ట్‌లో టాప్ 3 సినిమాలు అన్నీ రూ.200+ కోట్ల ఓపెనింగ్‌లను కలిగి ఉన్నాయి. అవి ‘ఓజీ’కి అందనంత దూరంలో ఉన్నాయి. మొదటి స్థానంలో పుష్ప 2: ది రైజ్ ఉంది. ఇది మొదటి రోజు రూ.274 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలు ఆర్.ఆర్.ఆర్ (రూ.223 కోట్లు) బాహుబలి 2 (రూ.215 కోట్లు) ఉన్నాయి.

మొత్తంగా, ‘ఓజీ’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ కల్యాణ్ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపించింది. పలు రికార్డులను బద్దలు కొట్టి, భారతీయ సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసింది. ఇది నిజంగా ఓ సరికొత్త విజయ చరిత్ర.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.