|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OG Movie: ఓజీకి మరో ప్యాకేజీ.. ప్రీమియర్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Published: 22-09-2025, 12:11 PM
OG Movie: ఓజీకి మరో ప్యాకేజీ.. ప్రీమియర్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి

పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలకు ఏపీ ప్రభుత్వం మరో అనుమతిని జారీ చేసింది. ప్రీమియర్ షోలకు ప్రత్యేక అనుమతులతో పాటు, టికెట్ ధరలను పెంచడానికి కూడా అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

Key Points

1

ఏపీ ప్రభుత్వం ఓజీ సినిమా ప్రీమియర్ షోలకు ప్రత్యేక అనుమతి.

2

ప్రీమియర్ షోలు రాత్రి 10 గంటలకు ప్రారంభం.

4

నట్టి కుమార్ టికెట్ ధరల పెంపును ఖండించారు.

ప్రీమియర్ షోలకు ప్రత్యేక అనుమతి

పవన్ కల్యాణ్ ఓజీ మూవీకి ఏపీ ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఈ సినిమా కోసం ప్రత్యేక జీవోను జారీ చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. ముందుగా అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ వేసుకోవచ్చని జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా రిలీజ్‌కు ముందు రోజే రాత్రి 10 గంటలకు ప్రీమియర్‌ షోలకు ప్రత్యేకంగా అనుమతులు ఇస్తూ జీవోను విడుదల చేసింది.

టికెట్ ధరల పెంపుపై వివాదం

ఇ‍ప్పటికే బెనిఫిట్‌ షో టికెట్‌ ధరను భారీగా పెంచారు. ఏకంగా ఒక్కో టికెట్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా విడుదల రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలను భారీగా పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 వసూలు చేసుకోవచ్చని దోపీడికి అవకాశమిచ్చారు. ఓజీ ఇష్టారాజ్యంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వడం కరెక్ట్‌ కాదని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఖండించారు.

తెలంగాణలోనూ అనుమతి

కాగా.. తెలంగాణలోనూ ఓజీ మూవీకి ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్‌ షో టికెట్‌ ధర రూ.800గా నిర్ణయించారు. అంతేకాకుంజా ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది.

చివరగా, ఓజీ సినిమా విడుదలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇవ్వడం, టికెట్ ధరల పెంపుపై వివాదం కొనసాగుతోంది. ఇది సినీ ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.