|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ముంబయిలో ఓజీ షూటింగ్: స్టైలిష్ లుక్ లో పవన్ కళ్యాణ్

Published: 28-05-2025, 8:02 AM
ముంబయిలో ఓజీ షూటింగ్: స్టైలిష్ లుక్ లో పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది.

Key Points

1

ముంబైలో ఓజీ సినిమా షూటింగ్ జరుగుతోంది.

2

పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్ లో కనిపిస్తున్నారు.

4

సుజిత్ దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతోంది.

ముంబైలో షూటింగ్ ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం గా ఎంత బిజీగా ఉన్నా.. పెండింగ్  లో  ఉన్న సినిమాలను కంప్లీట్ చేయడానికి టైమ్ కేటాయించారు. ప్రస్తుతం తన వంతు సినిమాలను వేగంగా పూర్తి చేస్తూ షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తయి, జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ ‘ఓజీ’ (OG) షూటింగ్ కూడా తుదిదశకు చేరుకుంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ‘అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే’ అనే పాటకి విపరీతమైన రెస్పాన్స్ లభించింది.

పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్

ఓజీ తాజా షూటింగ్ షేడ్యూల్ ముంబైలో జరుగుతోంది. దేశ ఆర్థిక రాజధానిలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముంబై వీధుల్లో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో కనిపిస్తూ, అక్కడ షూటింగ్‌లో పాల్గొంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు.

దసరా కానుకగా విడుదల

మేకర్స్ సమాచారం ప్రకారం ఓజీ మూవీ ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగనున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానులు ఈ గ్యాంగ్‌స్టర్ అవతారాన్ని తెరపై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రం పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘హరిహర వీరమల్లు’ అనంతరం విడుదలయ్యే ‘ఓజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఓజీ’ సినిమా ఒక పెద్ద వినోదం. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమా పవన్ కెరీర్ లో మరో మైలురాయి అవుతుందని అంచనా.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.