
సెప్టెంబర్ 22న విడుదలైన ఓజీ సినిమా ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ నటన, తమన్ బీజీఎం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రెండే డైలాగులతో పవర్ స్టార్ అదరగొడుతున్నాడు.
Key Points
పవన్ కళ్యాణ్ నోట రెండే డైలాగులు!
ఫుల్ యాక్షన్‌తో నిండిన ట్రైలర్!
గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యం!
పవర్ స్టార్ యాక్షన్
ఓజీ ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ గురువారమే (సెప్టెంబర్ 25) థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ట్రైలర్ ను సోమవారం (సెప్టెంబర్ 22) మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో పవన్ కల్యాణ్ నోట కేవలం రెండే రెండు డైలాగులు మాత్రమే వినిపించాయి. మిగతాదంతా ఫుల్ యాక్షనే.
పవన్ కల్యాణ్ రెండు నెలల గ్యాప్ లో రెండో సినిమాతో వస్తున్నాడు. దే కాల్ హిమ్ ఓజీ అంటూ మరో పవర్‌ఫుల్ పాత్రతో అభిమానులను అలరించబోతున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ లో పవర్ స్టార్ మాస్ యాక్షన్ పూనకాలు తెప్పిస్తోంది. బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త అనే రెండే డైలాగులు ఈ ట్రైలర్లో పవన్ నోట వినిపిస్తాయి.
బాంబే గ్యాంగ్ వార్స్ నేపథ్యం
ఇక చివర్లో ఓజస్ గంభీరా అంటూ తన పూర్తి పేరు చెబుతూ చేతిలో ఉన్న గన్ ను పేలుస్తూ చాలా ఆవేశంగా కనిపిస్తాడు. ఒకప్పటి బాంబే గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా కనిపిస్తోంది. విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కూడా ఈ సినిమాకు ప్లస్ కాబోతున్నాడు. ఇక ఫిమేల్ లీడ్ అయిన ప్రియాంక మోహన్ పాత్ర గురించి ట్రైలర్ లో పెద్దగా రివీల్ చేయలేదు.
సుజీత్ డైరెక్షన్ లో ఈ ఓజీ మూవీ తెరకెక్కింది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీలో పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్ తోపాటు ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, ఉపేంద్ర, అర్జున్ దాస్ లాంటి వాళ్లు నటించారు. తమన్ బీజీఎం ట్రైలర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే.
ఓజీ సినిమా విడుదల
ఈ సినిమా గురువారం (సెప్టెంబర్ 25) రిలీజ్ కానుండగా.. ఒక రోజు ముందే అంటే బుధవారం ప్రీమియర్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతి ఇచ్చాయి. ఇక ఈ మూవీ టికెట్ల ధరలు కూడా భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దసరా హాలిడేస్ కావడంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభిస్తాయన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ముఖ్యంగా హరి హర వీరమల్లు దారుణంగా బోల్తా పడిన నేపథ్యంలో ఈ ఓజీ మూవీపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఓజీ సినిమా, దసరా హాలిడేస్ లో భారీ విజయం సాధిస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.


