|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓం శాంతి.. శాంతి శాంతిః అంటున్న హీరోయిన్..

Published: 05-07-2025, 8:26 AM
ఓం శాంతి.. శాంతి శాంతిః అంటున్న హీరోయిన్..

ఈషా రెబ్బా నటించిన కొత్త సినిమా ‘ఓం శాంతి.. శాంతి శాంతిః’ టైటిల్ పోస్టర్ విడుదలైంది. తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 1, 2025న సినిమా విడుదల కానుంది.

Key Points

‘ఓం శాంతి.. శాంతి శాంతిః’ సినిమా విడుదల తేదీ

యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా (Isha Rebba) తాజాగా ఓ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే.తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ సజీవ్ (Director AR Sajeev) దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో బ్రహ్మాజీ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఈషా రెబ్బా. ‘మీ కొత్త మాన్సూన్ ట్రీట్.. ‘ఓం శాంతి.. శాంతి శాంతిః’(Om Shanti Shanti Shantihi,) రాబోతుంది. ఆగస్టు 1వ తేదీ 2025న అన్ని రకాల ఎమోషన్స్ సమానంగా దొరుకుతాయి.. ఓన్లీ్ థియేటర్స్.. మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు.. ప్రామిస్’ అంటూ ఈ సినిమాకు ‘ఓం శాంతి.. శాంతి శాంతిః’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపింది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో.. మేకర్స్ అద్భుతమైన టైటిల్ పోస్టర్‌తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. 2D యానిమేషన్ శైలిలో గ్రామీణ నేపథ్యంలో సెట్ చేసి రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో.. ఒక పెళ్లి జంట చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇందులో జంట ముఖాలను చూపించనప్పటికీ వైవాహిక విభేదాలను సూచిస్తున్న ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.

సినిమా టైటిల్ పోస్టర్ విడుదల

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

చిత్రం షూటింగ్ పూర్తయింది. అద్భుతమైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆగస్టు 1, 2025న థియేటర్లలో ‘ఓం శాంతి.. శాంతి శాంతిః’ సినిమాను ఆస్వాదించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.