
ఈటీవీ విన్ ఓటీటీ తన ‘కథా సుధ’ ఆంథాలజీలో భాగంగా సరికొత్త మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ సినిమా తీసుకొస్తోంది. ‘అనగనగా ఓ శుక్రవారం’ పేరుతో వస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి ఇంద్రజ కీలక పాత్రలో నటించారు. జులై 19న స్ట్రీమింగ్ కానుంది.
Key Points
ఈటీవీ విన్ ఓటీటీలో 'అనగనగా ఓ శుక్రవారం' జులై 19న స్ట్రీమింగ్
బాడీ స్వాపింగ్ కాన్సెప్ట్తో మైండ్ బెండింగ్ ఫాంటసీ థ్రిల్లర్
సీనియర్ నటి ఇంద్రజ లీడ్ రోల్లో నటించిన క్రేజీ సినిమా
'కథా సుధ – సండే స్టోరీస్' ఆంథాలజీ సిరీస్లో భాగం
ఇంద్రజ లీడ్ రోల్లో ‘అనగనగా ఓ శుక్రవారం’
OTT: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది. అనగనగా ఓ శుక్రవారం పేరుతో ఈటీవీ విన్ ఓటీటీ తన కథాసుధలో భాగంగా ఈ సినిమాను తీసుకొస్తోంది. వచ్చే ఆదివారం (జులై 19) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
OTT: ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సరికొత్త మైండ్ బెండింగ్ కాన్సెప్ట్‌తో డిజిటల్ ఆడియన్స్ ముందుకు వస్తోంది. ‘కథా సుధా – సండే స్టోరీస్’ ఆంథాలజీ సిరీస్‌లో భాగంగా ‘అనగనగా ఓ శుక్రవారం’ అనే క్రేజీ సినిమాను జులై 19న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఒకరి జీవితం ఇంకొకరిగా మారిపోతే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ ఫాంటసీ లైన్‌తో ఈ కథ నడవబోతోంది.
ఒకే ఒక్క రాత్రిలో లైఫ్ తారుమారు!
బాడీ స్వాపింగ్ కాన్సెప్ట్తో మైండ్ బెండింగ్ థ్రిల్లర్
తెలుగులో ‘శుక్రవారం తారుమారు’ అనే ట్యాగ్‌లైన్ పెట్టడంతో ఈ స్టోరీ చుట్టూ ఏదో పెద్ద ఫాంటసీ లేదా సస్పెన్స్ ఎలిమెంట్ ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. హాలీవుడ్ లో బాడీ స్వాపింగ్ లేదా అల్టర్నేట్ రియాలిటీ కాన్సెప్ట్‌లు చాలా పాపులర్. ఇప్పుడు అదే లెవెల్ హై-కాన్సెప్ట్ థ్రిల్‌ను లోకల్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూపించబోతున్నారు.
‘కథా సుధ’ ఆంథాలజీతో ఈటీవీ విన్ కొత్త ప్లాన్
జులై 19న ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్
ఇందులో సీనియర్ నటి ఇంద్రజ నటించడం విశేషం. పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగా ఉంది. ఓ గృహిణి, మరో నవతరం అమ్మాయి ఒకరి జీవితాల్లోకి మరొకరు వెళ్లినట్లుగా ఈ పోస్టర్ ను రూపొందించారు. ఈ పోస్టర్ తోనే మూవీ కాన్సెప్ట్ ఎంత భిన్నంగా ఉండబోతోందో అర్థమవుతోంది.
మధురాపురి సదన మూవీ కూడా..
ఈటీవీ విన్ ఓటీటీ తీసుకొస్తున్న ఈ క్రేజీ కాన్సెప్ట్ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మాతో ఉండండి!


