|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆకట్టుకునే కథతో ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు – ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ – హీరోయిన్‌గా గ్లామర్ బ్యూటీ

Published: 16-08-2025, 4:45 AM
ఆకట్టుకునే కథతో ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు - ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ - హీరోయిన్‌గా గ్లామర్ బ్యూటీ

Key Points

1

సిద్ధార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా నటించారు.

2

గ్లామరస్ బ్యూటీ రాశి సింగ్ హీరోయిన్.

3

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.

నటీనటుల వివరాలు

పార్వతి దేవదాసుల ప్రేమ కథకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక లవ్ స్టోరీ లకు తెలుగు యూత్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే ఈసారి ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు టైటిల్‌తో ఓ విభిన్నమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మాహిష్మతి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట రామకృష్ణ దర్శక నిర్మాతగా ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు సినిమాలో సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా నటించగా.. గ్లామరస్ బ్యూటీ రాశి సింగ్ హీరోయిన్‌గా చేసింది.

అలాగే, వీరితోపాటు ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు సినిమాలో రఘు బాబు, కశి రెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతం రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత ఇతర కీలక పాత్రలు పోషించారు. రీసెంట్‌గా ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది.

కథాంశం మరియు బ్యాక్‌డ్రాప్

ప్రస్తుతం ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉండనుంది.

అయితే, ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు సినిమాను యువతను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నట్లు దర్శక నిర్మాత తోట రామకృష్ణ తెలియజేశారు. ఇక ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు సినిమాకు మోహిత్ రహమానియాక్ సంగీతం అందిస్తున్నారు.

సినిమా విడుదల తేదీ

ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్‌ తో పాటు సుద్దాల అశోక్ తేజ , భాస్కరభట్ల ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు సినిమాకు ఆకట్టుకునే సాహిత్యం అందించారు. అలాగే, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా శరత్ వర్మ ఉన్నారు. త్వరలో ఒక పార్వది ఇద్దరు దేవదాసులు సినిమాను విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే, హీరోయిన్ రాశి సింగ్ వరుసపెట్టి తెలుగు సినిమాలతో దూసుకుపోతోంది. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలో హీరోయిన్‌గా చేసిన రాశి సింగ్ బ్లైండ్ స్పాట్ మూవీలో కీ రోల్ ప్లే చేసింది. అలాగే, సుహాస్ నటించిన ప్రసన్నవదనం సినిమాలో లేడి విలన్‌గా మెప్పించింది రాశి సింగ్.

మొత్తంగా, ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ సినిమా యువతను ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకుడు చెప్తున్నారు. ఫస్ట్ లుక్ కు లభించిన స్పందన చూస్తే సినిమాపై అంచనాలు పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.