
టాలీవుడ్ నటి రాశి ఖన్నా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు, క్యాప్షన్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Key Points
రాశి ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది.
మెరూన్, పింక్ డ్రెస్సుల్లో, జిమ్‌లో, అడవిలో ఫోటోలు ఉన్నాయి.
ఫొటోలకు ఆమె రాసిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది.
నెటిజన్లు తమ ఇష్టాలను కామెంట్లుగా పోస్ట్ చేస్తున్నారు.
రాశి ఖన్నా అదిరిపోయే ఫోటోలు
‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘జోరు’(Joru), ‘జిల్’(Jill), ‘బెంగాల్ టైగర్’(Bengal Tiger), ‘శివం’(Shivam), ‘సుప్రీమ్’(Supreme), ‘హైపర్’(Hyper), ‘జై లవకుశ’(Jai Lava Kusa), ‘రాజా ది గ్రేట్’(Raja The Great), ‘ఆక్సిజన్’(Oxigen), ‘టచ్ చేసి చూడు’(Touch chesi Chudu), ‘తొలిప్రేమ’(Tholi Prema), ‘ప్రతి రోజు పండగే’(Prati Roju Pandage), ‘వెంకీ మామ’(Venky Mama), ‘వరల్డ్ ఫేమస్ లవర్’(world Famous Lover), ‘పక్కా కమర్షియల్’(Pakka Commercial), ‘తిరు’(Thiru) వంటి సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది.
ప్రజెంట్ ఈ అమ్మడు తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్(Bollywood)లోనూ ఐటెం సాంగ్స్‌లో చిందులేస్తూ ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోంది ఈ అమ్మడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రాశి ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
ఆకట్టుకునే క్యాప్షన్
అందులో మెరూన్ కలర్ డ్రెస్‌లో బుక్ పట్టుకుని, పింక్ కలర్ డ్రెస్‌లో కాఫీ కప్ పట్టుకుని, జిమ్ చేస్తున్న, ఫారెస్ట్‌లో ఎంజాయ్ చేస్తున్న, దేవుని ప్రార్థన చేస్తున్న నాలుగు ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘నిన్ను నింపే ప్రతిదీ శబ్దం చేయదు. కొన్ని ఆనందాలు మెల్లగా వస్తాయి. మిమ్మల్ని కదిలించే పేజీలో, నెమ్మదిగా చాయ్ తాగడం, మంచి చెమట, ఎక్కడికి వెళ్తున్నావని అడగని రోడ్డు లేదా నిశ్శబ్ద ప్రార్థన.. ఇవి నా ఇష్టాలు.. మరి మీవి ఏమిటి?’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు తమ ఇష్టాలను కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల స్పందన
A post shared by Raashii Khanna (@raashiikhanna)
రాశి ఖన్నా అభిమానులు ఆమె పోస్ట్‌కు విశేష స్పందన తెలిపారు. ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.


