|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వన్ ప్లస్ 13పై దిమ్మతిరిగే ఆఫర్! అమెజాన్‌లో ఇంత తక్కువ ధరకా? ఇక మీ కల నెరవేరినట్టే!

Published: 10-03-2026, 11:05 AM
వన్ ప్లస్ 13పై దిమ్మతిరిగే ఆఫర్! అమెజాన్‌లో ఇంత తక్కువ ధరకా? ఇక మీ కల నెరవేరినట్టే!
  • OnePlus 13 అమెజాన్‌లో రూ. 9,000 తగ్గింపుతో లభిస్తోంది.
  • HDFC, SBI, ICICI క్రెడిట్ కార్డులపై రూ. 3,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
  • ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
  • 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ ఎల్టీపీఓ 3K స్క్రీన్ కలిగి ఉంది.

అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ 2026 లో వన్ ప్లస్ 13 పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. పలు బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకు పొందవచ్చు.

వన్ ప్లస్ 13 అమెజాన్ డీల్ వివరాలు

OnePlus 13 : వన్‌ప్లస్ 13 ఫోన్ భారీగా తగ్గింది. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సేల్ లో భాగంగా అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే..

OnePlus 13 : వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఎయిర్ కండిషనర్లు, కెమెరాలపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. అనేక రకాల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

మీరు తక్కువ ఖర్చులో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ కోసం చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 13పై రూ. 12వేలు తగ్గింపుతో లభిస్తోంది. పూర్తి వివరాల కోసం ఓసారి లుక్కేయండి..

బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు

వన్‌ప్లస్ 13 అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13లో రూ. 69,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ సమయంలో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 60,999కు లిస్ట్ అయింది. రూ. 9వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.

Read Also : Income Tax Rules : ఇన్‌కమ్ టాక్స్ రూల్స్.. భర్త డబ్బులను భార్య SIPలో ఇన్వెస్ట్ చేస్తే.. వచ్చే రాబడిపై టాక్స్ ఎవరు కట్టాలి? ITRలో చూపించాలా?

మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయవచ్చు.

వన్ ప్లస్ 13 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వన్‌ప్లస్ 13 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అడ్రినో 830 జీపీయూతో వస్తుంది. ఈ ఫోన్ 24GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని అందిస్తుంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ ఎల్టీపీఓ 3K స్క్రీన్ ఉంది. అలాగే, డిస్‌ప్లే HDR10+కి సపోర్టు ఇస్తుంది. 4,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13 ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 120x డిజిటల్ జూమ్ వరకు, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో వస్తుంది.

అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ లో వన్ ప్లస్ 13 పై లభిస్తున్న ఈ ఆఫర్ వినియోగదారులకు మంచి అవకాశం. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.