
📌 Key Points
- నరేష్ మేడి, రజిత శాండీ నటనతో ఆపరేషన్ పద్మ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల!
- మాజీ హోం మంత్రి నంది కిషోర్ హత్యకు కుట్ర, కిల్లర్‌ను నియమించిన శత్రువులు!
- అవంతిక నేతృత్వంలో ఆపరేషన్ పద్మ టీమ్ ఏర్పాటు, కిల్లర్‌ను పట్టుకునే ఛేజింగ్!
- పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఆపరేషన్ పద్మ, ట్విస్టులతో కూడిన క్లైమాక్స్!
ఆపరేషన్ పద్మ మూవీ రివ్యూ మీకోసం! పొలిటికల్ కుంభకోణాలు, కిల్లర్ చేజింగ్, ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి. నరేష్ మేడి, రజిత శాండీ నటన అదుర్స్!
కిల్లర్‌తో ఆపరేషన్ పద్మ టీమ్ చేజ్!
Operation Padma : నరేష్ మేడి, రజిత శాండీ, రణధీర్ బీసు, KT మల్లిఖార్జున, రఘుపతి రెడ్డి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఆపరేషన్ పద్మ. ఘట్టమనేని అరవింద్ బాబు, రాఘవ మండలపు, రాంబాబు మండలపు నిర్మాణంలో కార్తికేయ వి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆపరేషన్ పద్మ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. మాజీ హోం మంత్రి నంది కిషోర్ పౌర సరఫరా శాఖలో జరిగిన భారీ కుంభకోణాన్ని బయట పెట్టడంతో సంచలనం నెలకొంటుంది. ఆ కుంభకోణాన్ని బయటపెట్టడంతో ప్రజల్లో మంచి పేరుని తెచ్చుకోగా కొంతమందికి మాత్రం టార్గెట్‌గా మారతాడు. దీంతో నంది కిషోర్ శత్రువులు అతనిని చంపడానికి కిల్లర్ కుల్‌దీప్(రణధీర్ బిసు) ను నియమిస్తారు. దీంతో అతన్ని కాపాడటానికి, ఆ కుంభకోణం కోసం ఆపరేషన్ పద్మ అని అవంతిక(రజిత శాండీ) నేతృత్వంలో ఓ టీంని ఏర్పాటు చేస్తారు. మరి అవంతిక, ఆమె టీమ్ మెంబర్స్ ఆ కిల్లర్ ని పట్టుకున్నారా? ఈ టీమ్ ఏం చేసింది? ఆపరేషన్ పద్మ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. పొలిటికల్ క్రైమ్ నేపథ్యంలో రెగ్యులర్ గా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ ఆపరేషన్ పద్మ కూడా అలాంటిదే. ఫస్ట్ హాఫ్ అంతా పొలిటికల్ గా, రాజకీయ నాయకులు చేసే కుంభకోణాలు, వాళ్ళ సీక్రెట్ వ్యవహారాలతో సాగుతుంది. నంది కిషోర్ ని చంపడానికి కిల్లర్ ని నియమించిన దగ్గర్నుంచి కథ కాస్త ఆసక్తిగా నడుస్తుంది. కిల్లర్, ఆపరేషన్ పద్మ టీమ్ మధ్య సీన్స్ ఎత్తుకు పైఎత్తు అన్నట్టు ఉంటాయి. అసలు ఏం జరిగింది అని కనిపెట్టడానికి కాస్త పరిశోధనాత్మకంగా రాసుకున్న సీన్స్ బాగానే ఉంటాయి. అక్కడక్కడా థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి. క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ తో సింపుల్ గానే ముగించారు.
కుంభకోణాల వెనుక అసలు రహస్యాలు?
నటీనటుల పర్ఫార్మెన్స్.. రణధీర్ బీసు కిల్లర్ పాత్రలో స్టైలిష్ పర్ఫామెన్స్‌తో బాగానే మెప్పించాడు. రజిత శాండీ పవర్ ఫుల్ పాత్రలో మెప్పించింది. రఘుపతి రెడ్డి, నరేష్ మేడి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. ఈ సినిమాలోని ఉమెన్ కారెక్టర్స్ అన్నీ కూడా అవసర్లేకపోయినా కాస్త బోల్డ్ గానే చూపించారు.
సాంకేతిక అంశాలు.. ఈ సినిమా సాంకేతికంగా ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్లేదు అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. కిల్లర్ వర్సెస్ ఆపరేషన్ టీమ్ అని మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్, కథ తీసుకున్నా దాన్ని ప్రజెంట్ చేసే విధానాన్ని ఇంకాస్త క్లారిటీగా రాసుకోవాల్సింది. ఎడిటింగ్ లో కొన్ని చోట్ల ల్యాగ్ సీన్స్ కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా కావాల్సినంత ఖర్చుపెట్టారు.
ట్విస్టులతో కూడిన క్లైమాక్స్!
మొత్తంగా ఆపరేషన్ పద్మ ఓ కిల్లర్ ని చంపడానికి సాగే యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
ఆపరేషన్ పద్మ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కుంభకోణాలు, కిల్లర్ చేజింగ్‌తో సినిమా ఉత్కంఠభరితంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

