
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు నటించిన ‘భూల్ చుక్ మాఫ్’ సినిమా థియేటర్ రిలీజ్ కు బదులుగా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఖరారైంది. ‘ఆపరేషన్ సిందూర్’ ప్రభావం ఈ నిర్ణయంపై ఎలా ప్రభావం చూపిందో చూద్దాం.
Key Points
రాజ్‌కుమార్ రావు నటించిన ‘భూల్ చుక్ మాఫ్’ థియేటర్ రిలీజ్ వాయిదా
‘ఆపరేషన్ సిందూర్’ ప్రభావంతో థియేటర్లకు ప్రేక్షకులు తగ్గడం
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న ‘భూల్ చుక్ మాఫ్’
అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 16 నుండి స్ట్రీమింగ్
థియేటర్ రిలీజ్ వాయిదా
బాలీవుడ్ (Bollywood) విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్ (Raj Kumar Rao) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భూల్ చుక్ మాఫ్’. వామికా గబ్బి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సి ఉంది. అంతే కాకుండా.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టగా పలు థియేటర్లలో టికెట్స్ సైతం అమ్ముడయ్యాయి. కానీ, ఇప్పుడు ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఎందుకంటే… ‘భూల్ చుక్ మాఫ్’ (Bhool Chuk Maaf) సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడిన సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) జరిగింది. దీంతో నార్త్ ఇండియాలో ప్రజలు ప్రసుత్తం థియేటర్స్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీనికి తోడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో రిస్క్ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ.. మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు వెనుకడుగు వేశారు. ఇందులో భాగంగానే థియేటర్‌లో కాకుండా ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమోజాన్ ప్రైమ్ వీడియోస్ (Amazon Prime Videos)లో ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
A post shared by Filmy Sadhu (@filmysadhu)
ఆపరేషన్ సిందూర్ ప్రభావం
ఓటీటీ రిలీజ్ వివరాలు
చివరకు, ‘ఆపరేషన్ సిందూర్’ ప్రభావం ‘భూల్ చుక్ మాఫ్’ సినిమా రిలీజ్‌ను ఓటీటీ వైపు మళ్ళించింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.


