|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆస్కార్ బరిలో ‘సిన్నర్స్’ సునామీ! హాలీవుడ్ రికార్డులు బద్దలు.. మార్చి 15న ఫలితం!

Published: 22-01-2026, 11:05 PM
ఆస్కార్ బరిలో 'సిన్నర్స్' సునామీ! హాలీవుడ్ రికార్డులు బద్దలు.. మార్చి 15న ఫలితం!
  • ఆస్కార్ బరిలో ‘సిన్నర్స్’ మూవీ.. ఏకంగా 16 నామినేషన్లు కొల్లగొట్టి సంచలనం!
  • ‘టైటానిక్’ రికార్డు బ్రేక్ చేసిన ‘సిన్నర్స్’.. ఉత్తమ నటుడిగా మైఖేల్ బి. జోర్డాన్ పోటీ!
  • ఉత్తమ దర్శకుడు రేసులో ర్యాన్ కూగ్లర్.. గట్టి పోటీ ఇస్తున్న పాల్ థామస్ ఆండర్సన్!
  • హీరోయిన్ల జాబితాలో జెస్సీ బక్లీ, రెనాటా రైన్సావా.. సపోర్టింగ్ యాక్టర్స్‌గా డెల్‌రాయ్ లిండో!

సినీ అభిమానులకు ఇది నిజంగా పండుగలాంటి వార్త! 2026 ఆస్కార్ అవార్డుల నామినేషన్లు వచ్చేశాయి. ఈసారి ఏ సినిమా సత్తా చాటుతుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. హైప్ మామూలుగా లేదు!

ఆస్కార్ నామినేషన్లలో సంచలనం సృష్టించిన ‘సిన్నర్స్’!

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ అకాడమీ అవార్డుల (Oscars 2026) నామినేషన్ల జాబితా విడుదలైంది. ఈ ఏడాది నామినేషన్లలో హాలీవుడ్ చిత్రం ‘సిన్నర్స్’ (Sinners) ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్న ఈ సినిమా, ఆస్కార్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పి అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో టైటానిక్, లా లా ల్యాండ్, ఆల్ అబౌట్ ఈవ్ సినిమాలు సాధించిన 14 నామినేషన్ల రికార్డును బద్దలు కొట్టి ‘సిన్నర్స్’ చరిత్ర సృష్టించింది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు (మైఖేల్ బి. జోర్డాన్) వంటి ప్రధాన విభాగాలతో పాటు దాదాపు అన్ని సాంకేతిక క్యాటగిరీల్లోనూ పోటీ పడుతోంది. ఈ నామినేషన్ల జాబితాలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ 13 నామినేషన్లతో రెండో స్థానంలో నిలవగా, ఫ్రాంకెన్‌స్టైన్, మార్టీ సుప్రీం వంటి సినిమాలు కూడా గట్టి పోటీనిస్తున్నాయి.

ముఖ్యమైన నామినేషన్ల లిస్ట్ ఇక్కడ చూద్దాం:

1. బెస్ట్ పిక్చర్స్ పోటీలో నిలిచిన సినిమాల లిస్ట్:

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

2. బెస్ట్ దర్శకుడుగా పోటీపడుతున్న వారి లిస్ట్:

ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)

పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

క్లోయి జావో (హ్యామ్‌నెట్)

జాష్ సాఫ్డీ (మార్టీ సుప్రీం)

యోఆకీమ్ ట్రియర్ (సెంటిమెంటల్ వాల్యూ)

3. బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలో పోటీపడుతున్న హీరోల లిస్ట్:

ఉత్తమ నటుడిగా మైఖేల్ బి. జోర్డాన్.. గట్టి పోటీ!

మైఖేల్ బి. జోర్డాన్ (సిన్నర్స్)

లియోనార్డో డికాప్రియో (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

తిమోతీ చాలమెట్ (మార్టీ సుప్రీం)

వాగ్నర్ మౌరా (ది సీక్రెట్ ఏజెంట్)

4. బెస్ట్ హీరోయిన్‌గా పోటీలో నిలిచిన వారి పేర్లు:

జెస్సీ బక్లీ (హ్యామ్‌నెట్)

రెనాటా రైన్సావా (సెంటిమెంటల్ వాల్యూ)

రోజ్ బర్న్ (ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యు)

కేట్ హడ్సన్ (సాంగ్ సంగ్ బ్లూ)

5. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలో పోటీపడుతున్న వారి లిస్ట్:

డెల్‌రాయ్ లిండో (సిన్నర్స్)

మార్చి 15న ఆస్కార్ అవార్డుల వేడుక.. ఏ సినిమా గెలుస్తుందో?

బెనిసియో డెల్ టోరో (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

జేకబ్ ఎల్రోడి (ఫ్రాంకిన్‌స్టైన్)

స్టెలెన్ స్కార్స్‌గార్డ్ (సెంటిమెంటల్ వాల్యూ)

6. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ లిస్ట్

టియానా టేలర్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఎల్ ఫానింగ్ (సెంటిమెంటల్ వాల్యూ)

ఇంగా ఇబ్సిడాటర్ లిల్లాస్ (సెంటిమెంటల్ వాల్యూ)

ఉత్తమ యానిమేటెడ్ చిత్రం: జూటోపియా 2, ఎలియో, ఆర్కో, కె-పాప్ డెమోన్ హంటర్స్, లిటిల్ ఆమలీ నిలిచాయి.. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ జాబితాలో: ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్), సెంటిమెంటల్ వాల్యూ (నార్వే), ఇట్ వాజ్ జస్ట్ ఆన్ యాక్సిడెంట్ (ఫ్రాన్స్), సిరాట్ (స్పెయిన్), ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ (ట్యునీషియా) ఉన్నాయి.

ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 98వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుక మార్చి 15, 2026న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో వైభవంగా జరగనుంది. ఆ రోజున ఆస్కార్ విజేతలు ఎవరో తెలిసిపోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు,నెటిజన్లు ఈ గోల్డెన్ నైట్ కోసం అప్పుడే కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. అవార్డులు ఎవరికి వస్తాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆస్కార్ నామినేషన్ల వివరాలు చూశారుగా. ‘సిన్నర్స్’ మూవీ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.