|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీ షేకింగ్: ‘రాక్షస’ క్రైమ్ థ్రిల్లర్‌కు రికార్డు రేటింగ్! మొసలే కిల్లరా? దిమ్మతిరిగే ట్విస్ట్!

Published: 21-02-2026, 6:06 AM
ఓటీటీ షేకింగ్: 'రాక్షస' క్రైమ్ థ్రిల్లర్‌కు రికార్డు రేటింగ్! మొసలే కిల్లరా? దిమ్మతిరిగే ట్విస్ట్!
  • క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రాక్షస’ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం!
  • విజయ్ రాఘవేంద్ర, మయూరి క్యాతరి ప్రధాన పాత్రలలో నటించారు.
  • వెబ్ సిరీస్‌కు ఏకంగా 9.9 రేటింగ్ రావడం విశేషం!
  • సీరియల్ కిల్లర్‌గా మొసలి? మిస్టరీని ఛేదించే ఎస్సై హనుమప్ప!

ఓటీటీలో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ అయింది! ‘రాక్షస’ అనే ఈ సిరీస్‌కు 9.9 రేటింగ్ రావడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ సిరీస్‌లో ఏముంది? ఎందుకు ఇంత క్రేజ్?

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘రాక్షస’

OTT Crime Investigative Thriller: ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రాక్షస స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఫిబ్రవరి 20 అంటే నిన్నటి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్‌కు ఏకంగా 9.9 రేటింగ్ రావడం ఆశ్చర్యంగా మారింది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ రాక్షస ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో వచ్చే కంటెంట్‌లో ఎక్కువగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ , కామెడీ జోనర్స్‌కు అంతా అట్రాక్ట్ అవుతుంటారి. ఎంత డిఫరెంట్‌గా ఈ జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌ లు తెరకెక్కిస్తే అవి అంతగా క్లిక్ అవుతాయి. అయితే, తాజాగా ఓటీటీలోకి నయా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

సీరియల్ కిల్లర్‌గా మొసలి? ఊహించని ట్విస్ట్!

ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌లో విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్ర పోషించారు. మయూరి క్యాతరి హీరోకు భార్యగా నటించింది. ఈ ఇద్దరితోపాటు రాక్షస ఓటీటీ సిరీస్‌లో అప్పన్న రామదుర్గ, అవినాష్, జహంగిర్ ఎమ్ఎస్, అభిజిత్, హులుగప్ప కత్తిమని, మహాదేవ్ హడాపద్, సుష్మిత జగప్ప తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

సిరీస్‌లో జరిగే హత్యలను సీరియల్ కిల్లర్ చేస్తున్నాడా, లేదా మొసలి చంపుతుందా అనే పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక్కో సమయంలో మొసలే సీరియల్ కిల్లర్ అనేలా కథనం సాగుతుంది. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్లలో నేరస్థుడిని పట్టుకోవడం ఒక ఎత్తైతే, ఆ నేరం వెనుక ఉన్న మానసిక సంఘర్షణను ఆవిష్కరించడం మరో ఎత్తు.

విజయ్ రాఘవేంద్ర, మయూరి క్యాతరి అద్భుత నటన

ఓ పండుగ సమయంలో నది ఒడ్డున మనిషి శరీర భాగాలు పోలీసులకు లభిస్తాయి. అతన్ని చంపింది మొసలే అని ప్రజలు భయపడుతుంటారు. అప్పటికే సౌదత్తి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసులు చాలా వరకు నమోదు అయి ఉంటాయి. మరి వారంతా ఏమయ్యారు?, మొసలికి బలయ్యారా? లేదా ఇంకేదైనా మిస్టరీ ఉందా? అనేది ఎస్సై హనుమప్ప తెలుసుకున్నాడా అనే అంశాలతో సాగే ఓటీటీ సిరీస్ రాక్షస.

క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి ‘రాక్షస’ ఒక మంచి ఎంపిక. సస్పెన్స్, థ్రిల్లింగ్‌తో కూడిన ఈ సిరీస్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.