
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన ‘హోమ్ బౌండ్’ సినిమా ఓటీటీలోకి వస్తోంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకుని, ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పొందిన ఈ చిత్రం నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
Key Points
జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా నటించిన 'హోమ్ బౌండ్' మూవీ
'ఆస్కార్ 2026' నామినేషన్స్ కోసం అఫీషియల్ ఎంట్రీ పొందిన చిత్రం
సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదల, యావరేజ్ టాక్ మాత్రమే
నవంబర్ 21 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
‘హోమ్ బౌండ్’ సినిమా విశేషాలు
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘హోమ్ బౌండ్’. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ప్రశంసలు అందుకుంది. పలు అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ చేయబడింది. అలాగే ‘ఆస్కార్ 2026’ నామినేషన్స్ కోసం అఫీషియల్ ఎంట్రీ పొందింది. అలాంటి ఈ మూవీ సెప్టెంబర్ 26న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజై జస్ట్ యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది. దీంతో అప్పుడే ‘హోమ్ బౌండ్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు మొహమ్మద్ షోయబ్ అలీ, చందన్ కుమార్ చుట్టూ తిరుగుతుంది. వీరిద్దరూ పోలీస్ ఆఫీసర్స్ కావాలని కలలు కంటారు. ఇందులో జాన్వీ కపూర్ పోషించిన సుధా భారతి పాత్ర అణగారిన వర్గాలు ఎదుర్కొనే నిర్మాణాత్మక అడ్డంకులకు అద్దం పడుతుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ డేట్
‘హోమ్ బౌండ్’ కథాంశం
థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ‘హోమ్ బౌండ్’ మూవీ ఆస్కార్ ఎంట్రీ వంటి గుర్తింపు పొందింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా నవంబర్ 21 నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సినిమా కచ్చితంగా వీక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము.


