|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT షాక్: అడవిలో టైమ్ లూప్ మాయాజాలం! మలయాళీ థ్రిల్లర్ తో గూస్ బంప్స్ ఖాయం!

Published: 17-04-2026, 9:05 AM
OTT షాక్: అడవిలో టైమ్ లూప్ మాయాజాలం! మలయాళీ థ్రిల్లర్ తో గూస్ బంప్స్ ఖాయం!
  • జియో హాట్ స్టార్ లో ‘సంభవం అధ్యాయం ఒన్ను’ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది!
  • మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 7.3!
  • ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో టైమ్ లూప్ కాన్సెప్ట్ తో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్!
  • పోర్చుగీసు వారి దండయాత్రల నాటి పరిస్థితులను టైమ్ లూప్ తో కనెక్ట్ చేస్తూ చిత్రం!

ఓటీటీలో మరో సంచలనం! అడవి నేపథ్యంలో టైమ్ లూప్ కాన్సెప్ట్ తో వస్తున్న మలయాళీ థ్రిల్లర్ మూవీ ‘సంభవం అధ్యాయం ఒన్ను’. ఊహించని ట్విస్టులతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఈ సినిమా మిస్సవ్వకండి!

అడవిలో ముగిని గుట్టు విప్పే సీక్రెట్స్

ఓటీటీలో రిలీజయ్యే మలయాళీ డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో విపరీతమైన ప్రేక్షక ఆదరణ ఉంది. మలయాళీ థ్రిల్లర్ సినిమాలని తెలుగు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. మలయాళీ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే ప్రేక్షకులు మినిమమ్ టైంపాస్ గ్యారెంటీ అని భావిస్తారు. తాజాగా మరో మలయాళీ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది.

ఆ చిత్రం పేరు సంభవం అధ్యాయం ఒన్ను. అంటే సంభవం అధ్యాయం ఒకటి అని అర్థం. మలయాళీ దర్శకులు ఫారెస్ట్ నేపథ్యంలో సింపుల్ గా ఒక కథ అనుకుని దానిచుట్టూ డ్రామా, అద్భుతమైన ట్విస్టులు జోడించి సినిమా తీసేస్తారు. దర్శకుడు జీతూ సతీషన్ కూడా అదే చేశారు. సంభవం చిత్రం ఫారెస్ట్ నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

టైమ్ లూప్ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్

ఆనంద్(అస్గర్ అలీ) అనే పోలీస్ అధికారి కర్ణాటక, కేరళ సరిహద్దుల్లోని ఫారెస్ట్ ప్రాంతానికి బదిలీ అవుతాడు. విధుల్లో చేరడానికి వెళుతున్న క్రమంలో ఆనంద్ ఒక యాక్సిడెంట్ చేస్తారు. ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత అడవిలో కొందరు యువకులు గొడవపడుతున్నారని తెలుస్తుంది. మరో పోలీస్ అధికారి అశోకన్ తో కలసి ఆనంద్ అడవిలోకి వెళతారు. అక్కడ ఊహించని విధంగా వీరికి ఒక శవం కనిపిస్తుంది. అంతలోనే తనని రక్షించమని, గాయపడ్డానని స్టీఫెన్ అనే పోలీస్ అధికారి వాకీటాకీలో ఆనంద్, అశోకన్ లకు తెలియజేస్తాడు.

గాయపడిన స్టీఫెన్ ని కాపాడేందుకు అడివి గురించి పూర్తిగా తెలిసిన రెజీ అనే పోలీస్ తో కలసి ఆనంద్, అశోకన్ బయలుదేరుతారు. అక్కడ వారు మనిషి శరీరం కాకి తల ఉన్న ఒక ఆలయానికి చేరుకుంటారు. అక్కడ కొన్ని మిస్టరీ అంశాలు వాళ్ళకి ఎదురవుతాయి. ఆ ఆలయం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి ? స్టీఫెన్ ని కాపాడారా ? కనిపించిన శవం ఎవరిది ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాలి.

ఫ్యామిలీతో కలిసి చూసేందుకు బెస్ట్ మూవీ

సినిమా ఆధ్యంతం సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టేలా ఉంటుంది. మిస్టరీ అంశాలకు దర్శకుడు సతీషన్ టైం లూప్ కాన్సెప్ట్ ని జోడించడం ఈ చిత్రానికి హైలైట్. సినిమా ప్రారంభంలో ఒక ఫారెన్ లేడీని భయంకరంగా చూపించారు. ఆ తర్వాత కథని బిగినింగ్ సీన్స్ తో కనెక్ట్ చేసిన విధానం కూడా బావుంది. పోర్చుగీసు వారు దండెత్తిన అప్పటి పరిస్థితులని కూడా టైం లూప్ కాన్సెప్ట్ తో కనెక్ట్ చేశారు. సినిమాలో అక్కడక్కడా కొంత సాగదీత ఉంటుంది. అది తప్ప మైనస్ ఇంకేమీ లేదు. ఫ్యామిలీ మొత్తం కలసి ఈ చిత్రం చూడొచ్చు. జియో హాట్ స్టార్ లో తెలుగు వెర్షన్ స్టీమింగ్ అవుతోంది. ఐఎండిబి లో ఈ చిత్రానికి 7.3 రేటింగ్ ఉంది.

మొత్తానికి ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పవచ్చు. టైమ్ లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూడాలంటే జియో సినిమాలో చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.