|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT Movies: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన మూవీస్

Updated: 01-10-2025, 11:01 PM
OTT Movies: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన మూవీస్

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అనేక తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అయితే, ‘నీ బంధీనైపోయా’ మరియు ‘4 గర్ల్స్’ చిత్రాలు ఎలాంటి ప్రచారం లేకుండా విడుదల కావడం గమనార్హం.

Key Points

1

నిశ్శబ్దంగా ఓటీటీలోకి వచ్చిన 'నీ బంధీనైపోయా' చిత్రం.

2

'4 గర్ల్స్' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ ద్వారా అందుబాటులో.

4

మహావతార్ నరసింహా, కన్యాకుమారి వంటి సినిమాలతో పాటు ఈ చిత్రాలు కూడా విడుదలయ్యాయి.

నిశ్శబ్ద విడుదల: ‘నీ బంధీనైపోయా’

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి పలు సినిమాల వచ్చాయి. వాటిలో మహావతార్ నరసింహా,‍ కన్యాకుమారి, కొత్త రంగుల ప్రపంచం లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్ రిలీజయ్యాయి. అలానే ఎలియో, 28 ఇయర్స్ లేటర్ తదితర హాలీవుడ్ డబ్బింగ్ బొమ్మలు కూడా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఇవి కాకుండా మరో రెండు తెలుగు చిత్రాలు కూడా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీల్లోకి రావడం విశేషం.

‘4 గర్ల్స్’ సినిమా ఓటీటీలో

గత నెల 1వ తేదీన థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా ‘నీ బంధీనైపోయా’. అసలు ఇది ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా తెలీదు. చిన్న నటీనటులతో తీసిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్  అవుతోంది. 2 గంటల పాటు సాగే ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కించారు. జానకి అనే అమ్మాయి.. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి దూరంగా వెళ్లిపోయి బతకాలనుకుంటుంది. కానీ ఓ వ్యక్తి ఈమెని కిడ్నాప్ చేస్తాడు. ఇంతకీ అతడెవరు? ఈమెనే ఎందుకు బంధించాడు? అనేదే మిగతా స్టోరీ.

చిన్న సినిమాల ప్రభావం

అలానే ఈ ఏడాదే థియేటర్లలో రిలీజైన ‘4 గర్ల్స్’ అనే సినిమా కూడా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ఇది రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ చూడొచ్చు. శ్రుతిక, ఆక్షణ, ప్రిన్స్, అంకుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శివ దర్శకత్వం వహించాడు. అయితే ఇవి చిన్న సినిమాలు. కంటెంట్ పరంగానే అంతంత మాత్రంగానే ఉందనే టాక్ వినిపిస్తుంది. ఆసక్తి బట్టి చూడండి.

చిన్న బడ్జెట్ సినిమాలైన ‘నీ బంధీనైపోయా’ మరియు ‘4 గర్ల్స్’ ఓటీటీలో విడుదల కావడం విశేషం. కథాంశం ఆసక్తికరంగా ఉంటే చూడవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.