
ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోయినా, ఓటీటీల్లో మాత్రం 27 కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ‘మెట్రో ఇన్ డైనో’ లాంటి హిందీ సినిమాలు, ‘రాంబో ఇన్ లవ్’ లాంటి తెలుగు సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
Key Points
ఈ వారం ఓటీటీల్లో 27 కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి.
హిందీ చిత్రం 'మెట్రో ఇన్ డైనో' ఆసక్తికరంగా ఉంది.
'రాంబో ఇన్ లవ్' అనే తెలుగు సిరీస్ కూడా ఓటీటీలో విడుదలవుతోంది.
అబిగైల్, కరాటే కిడ్స్ లెజెండ్స్, ఇండియన్ ఐడల్ 4 వంటివి కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి వినాయక చవితి పండగ కూడా ఉంది. కానీ థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ‘సుందరకాండ’, ‘త్రిబాణధారి బార్బరిక్’, ‘అర్జున్ చక్రవర్తి’, ‘కన్యాకుమారి’ లాంటి చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. జాన్వీ కపూర్ హిందీ మూవీ ‘పరమ్ సుందరి’ కూడా ఇదే వీకెండ్‌లో బిగ్ స్క్రీన్‌పైకి రానుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 27 వరకు కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి.
ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఉన్నంతలో మెట్రో ఇన్ డైనో అనే హిందీ మూవీ ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు అబిగైల్, కరాటే కిడ్స్ లెజెండ్స్, సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రాలతో పాటు రాంబో ఇన్ లవ్ అనే తెలుగు సిరీస్, ఇండియన్ ఐడల్ 4 కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి రానుందంటే?
ఈ వారం రిలీజయ్యే సినిమాల జాబితా (ఆగస్టు 25 నుంచి 31 వరకు)
అబిగైల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 26
క్రిస్టోఫర్ (డానిష్ మూవీ) – ఆగస్టు 27
కత్రినా: కమ్ హెల్ అండ్ హై వాటర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 27
మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 28
ద థర్స్‌డే మర్డర్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 28
మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) – ఆగస్టు 29
టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) – ఆగస్టు 29
ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు
అన్‌నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 29
కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్ చిత్రం) – ఆగస్టు 30
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) – ఆగస్టు 29
మాల్డిటొస్ (ఫ్రెంచ్ సిరీస్) – ఆగస్టు 25
పటి సీజన్ 2 (పొలిష్ సిరీస్) – ఆగస్టు 26
థండర్ బోల్ట్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 27
డే ఆఫ్ రెకనింగ్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 28
మై డెడ్ ఫ్రెండ్ జో (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 28
హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29
రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) – ఆగస్టు 29
మాయకూతు (తమిళ సినిమా) – ఆగస్టు 27
ఏ సినిమా ఏ ఓటీటీలో?
గెవి (తమిళ మూవీ) – ఆగస్టు 27
సోదా (కన్నడ సిరీస్) – ఆగస్టు 29
సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) – ఆగస్టు 29
ఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) – ఆగస్టు 29
బెటర్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 29
ఎరోటిక్ స్టోరీస్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29
క్రాప్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29
షేర్ ఐలాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29
హాఫ్ సీఏ సీజన్ 2 (హిందీ సిరీస్) – ఆగస్టు 27
మొత్తం మీద, ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఎన్నో ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన చిత్రాలను ఎంచుకొని ఆనందించండి!


