|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీ సంస్థ నుంచి థియేట్రికల్ రిలీజ్ మూవీ.. ఇలా తొలిసారి.. కోచింగ్ సెంటర్ల కథతో తెలుగులో స్ట్రీమింగ్.. ఏ ఓటీటీ అంటే?

Published: 20-07-2025, 8:14 PM
ఓటీటీ సంస్థ నుంచి థియేట్రికల్ రిలీజ్ మూవీ.. ఇలా తొలిసారి.. కోచింగ్ సెంటర్ల కథతో తెలుగులో స్ట్రీమింగ్.. ఏ ఓటీటీ అంటే?

సాధారణంగా థియేటర్ల తర్వాతే ఓటీటీలో సినిమాలు విడుదల అవుతాయి. కానీ, ఈటీవీ విన్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాను మొదట థియేటర్లలో విడుదల చేయనుంది. ఇది ఒక అరుదైన ప్రయోగం.

Key Points

1

ఓటీటీ సంస్థ నుండి థియేట్రికల్ రిలీజ్, ఇది తొలిసారి!

2

లిటిల్ హార్ట్స్ సినిమా కోచింగ్ సెంటర్ల నేపథ్యంలో తెరకెక్కుతోంది.

4

ఈటీవీ విన్ ఓటీటీలో తర్వాత విడుదల.

లిటిల్ హార్ట్స్: ఒక వినూత్న ప్రయోగం

సాధారణంగా థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరికొన్ని సార్లు చాలా అరుదుగా ఓటీటీలో సూపర్ హిట్ అయిన సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుంటారు. ఇలా కాకుండా మొదట బుల్లితెర పై అంటే టీవీల్లో ప్రసారం చేసిన తర్వాత ఓటీటీ రిలీజ్ చేస్తుంటారు.

కాకపోతే, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఒరిజనల్ సినిమాలుగా, వెబ్ సిరీస్‌లుగా తెరకెక్కిన ఏదైనా సరే ఆ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలోనే రిలీజ్ అవుతుంటాయి. కానీ, ఫర్ ది ఫస్ట్ టైమ్ ఓటీటీ సంస్థ ఒరిజినల్ సినిమాగా తెరకెక్కి ఆ ఓటీటీలో కాకుండా ముందుగా థియేటర్లలో విడుదల కానుంది ఓ సినిమా.

ఆ తెలుగు సినిమానే లిటిల్ హార్ట్స్. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ఈ అత్యంత అరుదైన కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. ఈటీవీ విన్ ఒరిజినల్ సినిమాగా లిటిల్ హార్ట్స్ సినిమాను నిర్మించనున్నారు. కానీ, ఈ మూవీని నేరుగా ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాతే లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ కానుంది.

కోచింగ్ సెంటర్ల నేపథ్యం

అయితే, లిటిల్ హార్ట్స్ థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ అంటూ లిటిల్ హార్ట్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ పోస్టర్‌కు “నో టచింగ్.. ఓన్లీ హార్ట్ టచింగ్.. నో పోస్టర్.. ఓన్లీ పేపర్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

అలాగే, లిటిల్ హార్ట్స్ థియేటర్లలో విడుదల కానున్నట్లు పోస్టర్‌లో వెల్లడించారు. కాగా, 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఓటీటీ సిరీస్‌ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న యువ నటుడు మౌళి, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ హీరోయిన్ శివానీ నాగారం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈటీవీ విన్ యొక్క కొత్త ప్రయత్నం

ఈ ఇద్దరితోనే లిటిల్ హార్ట్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ఆ పోస్టర్‌లో పలు కోచింగ్ సెంటర్ల కోర్సులతో నిండి ఉన్న ప్రాంప్లెట్స్ ఉన్నాయి. మౌళి, శివానీ నాగారం తమ చేతులతో లవ్ సింబల్ చూపిస్తూ పోజు ఇచ్చారు. అయితే, లిటిల్ హార్ట్స్ సినిమాను కోచింగ్ సెంటర్ల నేపథ్యంతో యూత్‌ఫుల్ అంశాలతో తెరకెక్కించినట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

లిటిల్ హార్ట్స్ సినిమాను ఆదిత్య హాసన్ నిర్మిస్తుండగా.. సిన్‌జిత్ యర్రమల్లి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న లిటిల్ హార్ట్స్ సినిమా నటీనటుల వివరాలను ఇంకా తెలియాల్సి ఉంది.

లిటిల్ హార్ట్స్ సినిమా థియేట్రికల్ విడుదల తర్వాత ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కోచింగ్ సెంటర్ల నేపథ్యంతో వచ్చే ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.