
12th ఫెయిల్ సినిమాతో పేరు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే మరియు సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ నటించిన ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ అనే రొమాంటిక్ కామెడీ ఓటీటీలో విడుదలవుతోంది. కిస్సింగ్, కామెడీ, ఎమోషనల్ సీన్లు ఈ సినిమా ప్రధాన ఆకర్షణలు.
Key Points
12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే నటించిన రొమాంటిక్ కామెడీ.
షనయా కపూర్ హీరోయిన్‌గా డెబ్యూ.
సెప్టెంబర్ 5 నుండి జీ5 లో స్ట్రీమింగ్.
విక్రాంత్ మాస్సే మరియు షనయా కపూర్ జంట
12th ఫెయిల్ మూవీతో దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న హీరో విక్రాంత్ మాస్సే. హిందీలో అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన విక్రాంత్ మాస్సే 12th ఫెయిల్ సినిమాతో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్‌గా విక్రాంత్ మాస్సే నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా ఆంఖోన్ కీ గుస్తాఖియాన్.
ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి వరకు సోషల్ మీడియాలో హాట్ అండ్ గ్లామర్ ఫొటోల తోనే బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న షనయా తొలిసారిగా హీరోయిన్‌గా కనిపించింది.
విక్రాంత్ మాస్సీ , షనయా కపూర్‌లో రొమాంటిక్ డ్రామా చిత్రం ఆంఖోన్ కీ గుస్తాఖియాన్‌కు సంతోష్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రస్కిన్ బాండ్ రచించిన ది ఐస్ హ్యావ్ ఇట్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు.
రొమాంటిక్ కామెడీ డ్రామా
జహాన్ (విక్రాంత్ మాస్సే) ఒక అంధ సంగీతకారుడు. సబా (షనయా కపూర్) నటిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే యువతి. వీరిద్దరు అనుకోకుండా ఓ సారి రైలు ప్రయాణంలో కలుసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు తమ అభిరుచులను పంచుకుంటారు. అలా వీరి మధ్య స్నేహం చిగిరించి ప్రేమకు దారి తీస్తుంది.
కానీ, ఒకానొక సమయంలో సబా జీవితంలో మూడో వ్యక్తి వస్తాడు. ఆ తర్వాత వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి?. సబా, జహాన్ పెళ్లి చేసుకున్నారా? చివరికి ఏమైంది? అనే కథనంతో ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ సినిమా కథ.
నిజానికి ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ సినిమా ఒక మ్యూజికల్ రొమాంటిక్ మెలో డ్రామా. టైటిల్‌కు కళ్లు కోపగించుకుంటున్నాయి అనే అర్థం వస్తుంది. కానీ, ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ అనేది కాస్తా కవితాత్మకంతో చెప్పే పదం. హీరో అంధుడు కాబట్టి టైటిల్ అలా పెట్టినట్లుగా తెలుస్తోంది.
జీ5 లో ఓటీటీ రిలీజ్
ఇకపోతే మూవీలో విక్రాంత్, షనయా మధ్య బ్యూటిఫుల్ కిస్సింగ్ సీన్స్ ఎక్కువగానే ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అలాగే ఎమోషనల్, కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. ఇలాంటి బ్యూటిఫుల్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా సుమారు 25 రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేస్తోంది.
సెప్టెంబర్ 5 నుంచి ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. జీ5లో హిందీ భాషలో ఆంఖోనీ కీ గుస్తాఖియాన్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 1) జీ5 ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.
చివరగా, ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ సినిమా ప్రేక్షకులను అలరించే రొమాంటిక్ కామెడీ అని చెప్పవచ్చు. జీ5 లో ఈ సినిమా చూడటాన్ని మిస్ చేసుకోకండి.


