|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రూల్స్ మార్చిన ఓటీటీలు.. అలా చేస్తే ఫస్ట్ బిగ్గెస్ట్ మూవీగా అఖండ -2

Published: 02-12-2025, 8:10 PM
రూల్స్ మార్చిన ఓటీటీలు.. అలా చేస్తే ఫస్ట్ బిగ్గెస్ట్ మూవీగా అఖండ -2
  • ఓటీటీలు సినిమా హిట్‌/ఫ్లాప్‌ ఆధారంగా కొనుగోలు విధానాన్ని మార్చాయి.
  • థియేటర్లలో బాగా ఆడితే ఓటీటీలు ఒప్పంద అమౌంట్‌పై 25% అదనంగా చెల్లిస్తాయి.
  • కొత్త ఓటీటీ మోడల్‌ను అనుసరించనున్న తొలి భారీ చిత్రం బాలకృష్ణ అఖండ-2.
  • అధిక టికెట్, స్నాక్స్ ధరల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారు.

సినిమా నిర్మాణంలో ఓటీటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీలు కొత్త కొనుగోలు విధానాన్ని ప్రకటించాయి. థియేటర్లలో సినిమా విజయంపై ఆధారపడి చెల్లింపులు మారతాయి. ఈ నూతన విధానాన్ని అనుసరించే తొలి భారీ చిత్రం బాలకృష్ణ అఖండ-2. అధిక ఖర్చుల వల్ల థియేటర్లకు ప్రేక్షకులు దూరం అవుతున్నారు.

ఓటీటీల కొత్త నిబంధనలు

నిర్మాతలకు సేఫ్ సైడ్ గా మారిన ఓటీటీలు గత నెలలో షాకిచ్చాయి. సినిమా హిట్, ఫ్లాప్ ఆధారంగా ఓటీటీలు సినిమాను కొనుక్కోవడం స్టార్ట్ చేశాయి. గతంలో అయితే హిట్టా , ఫట్టా అన్నది సంబంధం లేకుండా అగ్రిమెంట్ చేసుకున్న అమౌంట్ కు సినిమా కొనేవాళ్లు. కానీ.. ఇప్పుడు ఆ రూల్ మారింది. థియేటర్లలో సినిమా బాగా ఆడితేనే అగ్రిమెంట్ అమౌంట్ పై 25 శాతం అదనంగా చెల్లించనున్నాయి ఓటీటీలు. ఒకవేళ బాగా ఆడకపోతే అగ్రిమెంట్ అమౌంట్ నుంచి 25 శాతం తగ్గించనున్నాయి. అయితే ఈ కొత్త నెట్ ఫ్లిక్స్ మోడల్ ను ఫాలో కానున్న తొలి భారీ చిత్రంగా అఖండ -2 తాండవం నిలవనుంది. రిలీజుకు రెడీ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ.. కొత్త ఓటీటీ రూల్స్ ను పాటించనుంది.

అఖండ-2పై ఓటీటీ ప్రభావం

కాగా.. చిన్న సినిమాలైతే 2-3 వారాలకు, కంటెంట్ ఉన్న సినిమాలు, పెద్దసినిమాలైతే గరిష్టంగా నాలుగు వారాలకు ఓటీటీల్లో రిలీజవుతున్నాయి. దీంతో థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. కారణం ఏంటో అందరికీ తెలుసు. సినిమాల టికెట్ల రేట్లతో పాటు వాటర్ బాటిల్, పాప్ కార్న్, ఇతర స్నాక్స్ రేట్లు భారీగా ఉండటమే. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సినిమా చూడాలంటే కనీసం రూ.2000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

థియేటర్లకు ప్రేక్షకుల దూరం

ఇక అఖండ -2 సినిమా విషయానికొస్తే.. బోయపాటి శ్రీను – బాలయ్యల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమ. మరో రెండ్రోజుల్లా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో భారీ హైప్ క్రియేట్ అయింది. థియేటర్లలో అఖండగా బాలకృష్ణ రుద్రతాండవం కన్ఫర్మ్ అంటూ.. ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

ఓటీటీల మారిన నిబంధనలు, థియేటర్ల అధిక ధరలు సినిమా పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి. అఖండ-2 వంటి భారీ చిత్రాలు ఈ కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. ఇది సినిమా భవిష్యత్తును నిర్ణయించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.