|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒక్క రోజులోనే ఓటీటీ ట్రెండింగ్ లో థ్రిల్లర్ మూవీ ‘సర్జమీన్’.. ఆ స్టార్ హీరో కొడుకు సినిమా.. తండ్రీకొడుకుల మధ్య వార్.. దేశం కోసం!

Published: 26-07-2025, 5:13 AM
ఒక్క రోజులోనే ఓటీటీ ట్రెండింగ్ లో థ్రిల్లర్ మూవీ 'సర్జమీన్'.. ఆ స్టార్ హీరో కొడుకు సినిమా.. తండ్రీకొడుకుల మధ్య వార్.. దేశం కోసం!

ఓటీటీ వేదికపై ‘సర్జమీన్’ అనే థ్రిల్లర్ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఒక్క రోజులోనే ట్రెండింగ్‌లోకి ఎగబాకింది. పృథ్వీరాజ్, కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్ ల నటనతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

Key Points

1

ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయిన 'సర్జమీన్' సినిమా ఒక్క రోజులోనే ట్రెండింగ్‌లో!

2

పృథ్వీరాజ్, కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

4

జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో సహా అనేక భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

సర్జమీన్: ఒక్క రోజులోనే ట్రెండింగ్‌లో!

ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చిన దేశభక్తి థ్రిల్లర్ మూవీ ‘సర్జమీన్’ (Sarzameen) అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది ఈ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్సకు దేశభక్తి అనే కథాంశం జోడించి ఈ ఫిల్మ్ ను తెరకెక్కించారు. ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, హిందీ సీనియర్ నటి కాజోల్, స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్స్ ప్లే చేశారు.

సర్జమీన్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చింది. జులై 25 నుంచి ఈ సినిమా జియోహాట్‌స్టార్‌ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నిన్న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఒక్క రోజులోనే ఓటీటీలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఈ హిందీ ఒరిజినల్ ఫిల్మ్ హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఓటీటీలోకి అడుగుపెట్టింది. బోమన్ ఇరానీ కుమారుడు కయోజ్ ఇరానీకి డైరెక్టర్ గా ఇదే తొలి ఫిల్మ్.

స్టార్ నటీనటుల కలయిక

శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన సర్జమీన్ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతోంది. హిందీ మూవీ అయినప్పటికీ తెలుగులో ఈ రోజు ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది సర్జమీన్. హిందీలో స్పెషల్ ఓపీఎస్ 2 తర్వాత సెకండ్ ప్లేస్ కు వచ్చేసింది సర్జమీన్. మలయాళం, కన్నడలోనూ సెకండ్ ప్లేస్ లో ఉంది ఈ సినిమా. తమిళంలో టాప్-6లో కొనసాగుతోంది ఈ థ్రిల్లర్ మూవీ.

ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన తన కొడుకు ఎలా తిరిగొచ్చాడు? అతను టెర్రరిస్ట్ గా మారాడని ఆర్మీలో కర్నల్ అయిన తండ్రి ఎందుకు అనుమానించాల్సి వచ్చిందన్నదే సర్జమీన్ కథ. మధ్యలో తండ్రీకొడుకుల మధ్య నలిగిపోయే తల్లి ఎమోషన్ ఉంటుంది.

దేశభక్తి నేపథ్యం, తండ్రీకొడుకుల కథ

కర్నల్ విజయ్ మీనన్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ఆర్మీలో పనిచేస్తుంటారు. కశ్మీర్ లో టెర్రరిజాన్ని అంతం చేసేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాడు. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్ని కొడుకు హర్మన్ (ఇబ్రహీం అలీ ఖాన్) సోల్జర్ గా మారాలనుకుంటాడు. కానీ అతనికి నత్తి సమస్య ఉండటంతో ఆర్మీలో చేరేందుకు అన్ ఫిట్ అని తండ్రి అనుకుంటాడు.

తండ్రీకొడుకుల మధ్య సమస్యల కారణంగా తల్లి మెహర్ (కాజోల్) ఇబ్బందిపడుతుంది. ఈ సమయంలోనే హర్మన్ ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. ఇద్దరు ఉగ్రవాదులను రిలీజ్ చేస్తేనే కొడుకును అప్పగిస్తామని డిమాండ్ చేస్తారు. కానీ విజయ్ మీనన్ అందుకు ఒప్పుకోడు. కొడుకును టెర్రరిస్ట్ లు చంపేశారనే విజయ్, మెహర్ అనుకుంటారు. కానీ అనూహ్యంగా హర్మన్ తిరిగొస్తాడు. కానీ అతని ప్రవర్తన చూస్తే విజయ్ కు డౌట్ వస్తుంది. కొడుకు టెర్రిరిస్ట్ గా మారాడా? అని అనుమానపడతాడు. మరి విజయ్ అనుమానంలో నిజం ఉందా? హర్మన్ ఎవరు? అన్నది సినిమాలో చూడాల్సిందే.

సర్జమీన్ సినిమా ఓటీటీలో అద్భుతమైన విజయం సాధించింది. దేశభక్తి, కుటుంబ కథాంశాలతో ఆకట్టుకుంటోంది. తప్పక చూడదగిన సినిమా ఇది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.