|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT Upcoming Movies: ఓటీటీలోకి మంచు మనోజ్‌, ఆర్జీవీ చిత్రాలు.. మ్యూజిక్‌ హిట్‌ మూవీ కూడా, స్ట్రీమింగ్‌ డేట్స్

Published: 09-07-2025, 3:01 AM
OTT Upcoming Movies: ఓటీటీలోకి మంచు మనోజ్‌, ఆర్జీవీ చిత్రాలు.. మ్యూజిక్‌ హిట్‌ మూవీ కూడా, స్ట్రీమింగ్‌ డేట్స్

ఈ వారం మరియు వచ్చే వారం ఓటీటీలో అనేక ఆసక్తికరమైన సినిమాలు విడుదల కానున్నాయి. మంచు మనోజ్, ఆర్జీవీ చిత్రాలతో పాటు ఒక మ్యూజికల్ హిట్ మూవీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. వీటి స్ట్రీమింగ్ తేదీలు మరియు ప్లాట్‌ఫామ్ వివరాలను తెలుసుకుందాం.

Key Points

1

8 వసంతాలు, నెట్‌ఫ్లిక్స్ లో జులై 11న స్ట్రీమింగ్.

2

ఆహాలో రామ్ గోపాల్ వర్మ చిత్రం శారీ జులై 11 నుంచి.

4

మంచు మనోజ్ చిత్రం భైరవం, జీ5లో జులై 18న.

ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు

ఓటీటీలో ఈ వారం పలు క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. అలాగే వచ్చే వారం మంచు మనోజ్‌ మూవీ కూడా రానుంది. ఇక ఈ వారంలో ఒక మ్యూజిక్‌ హిట్‌ మూవీ స్ట్రీమింగ్‌ కాబోతుండగా,

రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించిన ఓ బోల్ట్ సినిమా కూడా ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమాలేంటి? ఎప్పుడు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతున్నాయనేది చూస్తే.

ఈ వారం సడెన్‌ గా ఓటీటీలోకి వస్తోన్న మూవీ `8 వసంతాలు`. మూడు వారాల క్రితం రిలీజ్‌ అయిన ఈ మూవీ మ్యూజికల్‌గా ఆకట్టుకుంది. డైలాగ్స్ పరంగా ఆద్యంతం అలరించింది.

కానీ కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించలేకపోయింది. ఈ సినిమా కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. నెట్‌ ఫ్లిక్స్ లో ఈ నెల 11న స్ట్రీమింగ్‌ కానుంది.

మంచు మనోజ్ చిత్రం ఓటీటీ విడుదల

దీనికి ఫణింద్ర నార్సెట్టి దర్శకత్వం వహించగా, అనంతిక సనిల్‌కుమార్‌, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్‌ 20న థియేటర్లలో విడుదలైంది.

ఇదే రోజు `ఆహా`లో రామ్‌ గోపాల్‌ వర్మ మూవీ `శారీ` స్ట్రీమింగ్‌ కానుంది. ఇది ఇప్పటికే ఇతర ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కాగా, తాజాగా ఈ నెల 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

ఈ సినిమాకి గిరికృష్ణ కమల్‌ దర్శకత్వం వహించగా, ఇందులో సత్య యాదు, ఆరాధ్య దేవి నటించారు. రవి వర్మ నిర్మించారు.

వచ్చే వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

వీటితోపాటు జులై 11న మలయాళంలో హిట్‌ అయిన `నరివేట్ట` మూవీ సోనీ లివ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇందులో టొవినో థామస్‌, సూరజ్ వెంజరమూడు, చేరన్, ఆర్య సలీం, ప్రియంవద కృష్ణన్, ప్రణవ్ టియోఫిన్ వంటి వారు నటించారు. అనురాజ్‌ మనోహర్‌ దర్శకత్వం వహించారు.

మరోవైపు మంచు మనోజ్‌ మూవీ కూడా ఓటీటీలోకి రాబోతుంది. నారా రోహిత్‌, బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ కలిసి నటించిన `భైరవం` మూవీ వచ్చే వారం(జులై 18న) జీ 5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రం మే 30న థియేటర్లలో విడుదలైంది.

దాదాపు ఏడు వారాల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో ఫర్వాలేదనిపించింది. దీన్ని కెకె రాధామోహన్‌ నిర్మించారు.

చివరగా, ఈ వారం మరియు వచ్చే వారంలో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అనేక ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సినిమాలన్నీ విభిన్న ప్రక్రియలకు చెందినవి కావడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.