
📌 Key Points
- రణ్‌వీర్ సింగ్ నటన అదుర్స్, కానీ లొకేషన్స్‌పై పాక్ ప్రజల అసంతృప్తి!
- లారీ గ్యాంగ్ వార్ సీన్స్ కామెడీగా ఉన్నాయంటున్న పాకిస్తానీయులు, దర్శకుడిపై విమర్శలు!
- సారా అర్జున్ మినీ స్కర్ట్‌లో కనిపించడంపై పాక్ నెటిజన్ల ట్రోల్స్, దుస్తులపై కామెంట్స్!
- FA9LA పాట బాగాలేదంటున్న బలూచి ప్రజలు, ఇది బహ్రెయిన్ ర్యాపర్ పాటని విమర్శలు!
రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ నటించిన ‘ధురంధర్’ చిత్రంపై పాకిస్థానీయులు భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్దాం!
లొకేషన్స్‌పై పాక్ ప్రజల అసంతృప్తి
Pakistanis Reacts To Dhurandhar And The Revenge: ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్, ధురంధర్ 2 చిత్రంలో చూపించిన అంశాలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని కొందరు పాకిస్థానీయులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కరాచీ, ల్యారీ ప్రాంతాల చిత్రీకరణపై వారు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే, సరిహద్దు అవతల మాత్రం ఈ రెండు సినిమాలపై భిన్నమైన చర్చ నడుస్తోంది.
దుస్తులపై నెటిజన్ల ట్రోల్స్
రణ్‌వీర్ సింగ్ , సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. పాకిస్థాన్‌లోని కరాచీ, ల్యారీ ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది. అయితే, ఈ సినిమాలో చూపించిన ల్యారీ గ్యాంగ్ వార్స్, అక్కడి సంస్కృతి వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని కొందరు పాకిస్థానీయులు పెదవి విరుస్తున్నారు.
” ధురంధర్ సినిమాకు అనవసరమైన హైప్ ఇచ్చారు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. ‘ఎవరు ల్యారీని శాసిస్తే వారు కరాచీని శాసిస్తారు, ఎవరు కరాచీని శాసిస్తే వారు పాకిస్థాన్‌నే శాసిస్తారు’ అని. ఇది వినడానికి మాకు చాలా నవ్వు తెప్పించింది. కరాచీ నుంచి పాకిస్థాన్‌ను శాసించడం అసాధ్యం. రాజకీయం చేయాలంటే అది లాహోర్ నుంచే సాధ్యమవుతుంది” అని ఆ పాకిస్థానీ వ్యక్తి పేర్కొన్నారు.
పాట బాగాలేదంటున్న బలూచి ప్రజలు
తన పూర్వీకులు ల్యారీ ప్రాంతానికి చెందినవారేనని, అక్కడ గ్యాంగ్ వార్స్ ఉన్న మాట వాస్తవమే అయినా, అవి కేవలం రెండు వీధుల మధ్య జరిగే గొడవలే తప్ప దేశాన్ని శాసించే స్థాయిలో ఉండవని ఆయన వివరించారు.
రణ్‌వీర్ సింగ్ ధరించిన హాఫ్ స్లీవ్ కుర్తాల గురించి కూడా వారు స్పందించారు. పాకిస్థాన్‌లో ఎవరూ అలాంటి దుస్తులు ధరించరని, అది కేవలం సినిమాటిక్ ఎఫెక్ట్ కోసమే వాడారని తెలిపారు. ఇక సినిమాలో సూపర్ హిట్ అయిన ‘FA9LA’ పాట బాగున్నప్పటికీ, అది అసలు బలోచీ పాటే కాదని.. ఆ పాట పాడింది బహ్రెయిన్ కు చెందిన ర్యాపర్ అని గుర్తు చేశారు.
పాకిస్థానీయుల రియాక్షన్స్ తో ‘ధురంధర్’ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


