
రాజ్ తరుణ్ నటించిన క్రైమ్ కామెడీ ‘పాంచ్ మినార్’ సినిమా ప్రీమియర్‌లు ఇప్పటికే ప్రదర్శించబడ్డాయి. రూ. 5 కోట్ల మిస్టరీతో కూడిన ఈ మూవీ నవంబర్ 21న విడుదల కానుంది. కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా అలరించనుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
Key Points
రాజ్ తరుణ్ నటించిన తాజా క్రైమ్ కామెడీ సినిమా 'పాంచ్ మినార్' రివ్యూ.
రామ్ కడుముల దర్శకత్వంలో, రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన చిత్రం.
రూ. 5 కోట్ల చుట్టూ అల్లుకున్న సస్పెన్స్, కామెడీ కథాంశం.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన నవ్వుల ప్రయాణం ఎలా ఉందో తెలుసుకోండి.
సినిమా కథాంశం: 5 కోట్ల మిస్టరీ
రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ సినిమా పాంచ్ మినార్. రామ్ కడుముల దర్శకత్వం వహించిన పాంచ్ మినార్ నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఒకరోజు ముందుగానే అంటే ఇవాళ (నవంబర్ 20) మీడియాకు పాంచ్ మినార్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి పాంచ్ మినార్ రివ్యూలో తెలుసుకుందాం.
నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, రవి వర్మ, నితిన్ ప్రసన్న, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
నిర్మాతలు: మాధవి, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి
నిర్మాణ సంస్థ: కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్‌పీ
నటీనటుల పనితీరు, కామెడీ
విడుదల తేది: 21 నవంబర్ 2025
ఇటీవల ఆహా ఓటీటీ లోకి చిరంజీవ సినిమాతో అలరించిన రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ సినిమా పాంచ్ మినార్. రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహించారు.
ఇప్పటికే రిలీజైన పాంచ్ మినార్ సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నవంబర్ 21న పాంచ్ మినార్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. అయితే, రిలీజ్‌కు ఒకరోజు ముందే అంటే ఇవాళ (నవంబర్ 20) మీడియాకు పాంచ్ మినార్ స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి పాంచ్ మినార్ రివ్యూ లో తెలుసుకుందాం.
హత్య చేసినందుకు ఇద్దరు హంతకులకు రూ. 5 కోట్లు వస్తాయి. ఐదు కోట్లు తీసుకుని వెళ్తున్న క్రమంలో హంతకులు పోలీసులకు చిక్కుతారు. అదే సమయంలో ఐదు కోట్లు మాయం అవుతాయి.
దర్శకత్వం, సాంకేతిక విలువలు
ఆ తర్వాత ఏమైంది? ఆ 5 కోట్లు ఎవరు తీశారు? కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చింది? ఎవరు కిట్టుకు వచ్చిన కష్టాలు ఏంటీ? కిట్టు వెంట ఎందుకు కిరాయి హంతకులు, సీఐ (నితిన్ ప్రసన్న) ఎందుకు పడ్డారు? చివరికి ఐదు కోట్లు ఎవరికి దక్కాయి? పాంచ్ మినార్ అని టైటిల్‌కు కారణం ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
క్రైమ్ కామెడీ జోనర్‌కు తగినట్లుగా సినిమాలో కామెడీతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓ వైపు నటీనటుల నుంచి కామెడీని రాబట్టుకున్న దర్శకుడు మరోవైపు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను బాగా వచ్చేలా రాసుకున్నాడు. అలాగే, ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఏం జరుగుతుందనే ఆసక్తి పెంచేలా సీన్స్ రావడం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కామెడీ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
ప్రాణాలతో పాటు డబ్బుని దక్కించుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు బాగానే ఉంటాయి. అక్కడక్కడ వచ్చే కొద్దిపాటి టిస్టులు థ్రిలింగ్ కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. కొత్త రకమైన స్క్రీన్ ప్లేతో, మంచి టేకింగ్‌తో డైరెక్టర్ రామ్ కడుముల సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.
నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. విజువల్స్ బాగున్నాయి. సంగీతం పర్వాలేదు. బీజీఎమ్ సీన్స్‌కు తగినట్లు హైలెట్‌గా నిలిచింది. ఇక రాజ్ తరుణ్ కిట్టు పాత్రలో ఆకట్టుకున్నాడు. రాశి సింగ్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది.
మొత్తంగా, ‘పాంచ్ మినార్’ సినిమా క్రైమ్ కామెడీ ఇష్టపడే వారికి ఒకసారి చూడదగినది. రాజ్ తరుణ్ నటన, కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. 5 కోట్ల మిస్టరీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకోవడానికి సినిమా చూడాలి.


