|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇవాళ ఓటీటీలోకి పరంతు పో.. పేరెంట్స్, పిల్లలు అసలు మిస్ అవొద్దు.. తప్పకుండా చూసేందుకు 5 కారణాలు.. హార్ట్ టచింగ్ ఫిల్మ్

Published: 05-08-2025, 4:44 AM
ఇవాళ ఓటీటీలోకి పరంతు పో.. పేరెంట్స్, పిల్లలు అసలు మిస్ అవొద్దు.. తప్పకుండా చూసేందుకు 5 కారణాలు.. హార్ట్ టచింగ్ ఫిల్మ్

తమిళ సూపర్ హిట్ ‘పరంతు పో’ సినిమా ఇవాళ ఓటీటీలో విడుదలైంది. తండ్రీకొడుకుల మధ్య బంధం, రోడ్ ట్రిప్, కామెడీతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పిల్లల పెంపకం గురించి కూడా ఆలోచింపజేస్తుంది.

Key Points

1

తల్లిదండ్రులు, పిల్లలు కలిసి చూడదగిన హృద్యమైన కథ

2

చిన్నారులకు, పెద్దలకు నచ్చే కామెడీ, సింపుల్ హ్యూమర్

4

మ్యూజికల్ రోడ్ ట్రిప్ డ్రామాతో ఆకట్టుకునే కథనం

పరంతు పో: ఒక హృద్యమైన కుటుంబ కథ

తమిళ సూపర్ హిట్ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా ‘పరంతు పో’ (Paranthu Po) సినిమా ఇవాళ (ఆగస్టు 5) ఓటీటీలోకి వచ్చింది. జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్నెట్ లో తెగ ట్రెండ్ అవుతున్న ఈ సినిమాను తల్లిదండ్రులు, పిల్లలు అసలు మిస్ అవొద్దు. ఈ మూవీని ఓటీటీ లో తప్పకుండా ఎందుకు చూడాలో తెలిపే 5 కారణాలు ఇక్కడ ఉన్నాయి. తెలుగులోనూ సినిమా అందుబాటులో ఉంది. పరంతు పో అంటే దూరంగా ఎగిరిపోవడం అని అర్థం.

జులై 4, 2025న థియేటర్లలోకి వచ్చిన పరంతు పో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివ, గ్రేస్ ఆంటోని, మిథుల్ ర్యాన్, అంజలి, అజు వర్గీస్ తదితరులు నటించారు. ఒక పట్టణంలో నివసించే తండ్రి గోకుల్ (శివ), అతని ఎనిమిదేళ్ల కొడుకు అన్బు (మిథుల్ ర్యాన్) చుట్టూనే కథ తిరుగుతుంది. తల్లి గ్లోరీ (గ్రేస్ ఆంటోని) జాబ్ కోసం సిటీ బయట ఉంటుంది. తండ్రీకొడుకులే ఎక్కువగా కలిసి ఉంటారు. వీళ్లు రోడ్ ట్రిప్ కు వెళ్తారు. ఆ జర్నీలో ఏం జరిగిందన్నదే కథ.

ఇతర చిత్రాలకు భిన్నంగా పరంతు పోలో విపరీతమైన కామెడీ , సింపుల్ హ్యూమర్ ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారికీ నచ్చే చిత్రమిది. పిల్లల పెంపకం, మానవ జీవితాల పట్టణీకరణ, మానవ సంబంధాలు లేకపోవడం వంటి ప్రాపంచిక విషయాల గురించి దర్శకుడు రామ్ బరువైన అంశాలతో మాట్లాడగలిగాడు. కామెడీని ఒక సాధనంగా వాడుకున్న రామ్ తన పని తాను చేసుకుపోతాడు.

తండ్రీ కొడుకుల ఆసక్తికరమైన ప్రయాణం

పరంతు పో అనేది మ్యూజికల్ రోడ్ ట్రిప్ డ్రామా, అది చెప్పదలుచుకున్న విషయాలను సులువుగా, ఎంటర్ టైనింగ్ గా చెప్తుంది. బాతు గుడ్డు నుంచి డైనోసార్ పుట్టుకొస్తుందా అనే వింత ప్రశ్నను ఇది మిమ్మల్ని అడగవచ్చు. కానీ ఊహించడానికి ఎటువంటి హాని లేదని విచిత్రమైన వివరణను కూడా ఇస్తుంది. అయితే పరంతు పో సినిమా చూస్తున్నప్పుడు చాలా విషయాలు ఆలోచించాలి.

నేటి కాలంలో ఈ సినిమా పిల్లల పెంపకం గురించి మాట్లాడుతుంది. ఇది జీవిత గమనాన్ని ఆస్వాదించడం, చిన్న క్షణాలను కూడా ఎంజాయ్ చేయడం ఎలాగో చూపిస్తుంది. అన్బు తన తండ్రి గోకుల్ ను చెట్లు, పర్వతాలు ఎక్కేలా చేసినప్పుడు, ఆ సాహసానికి ఆ వ్యక్తి మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా వెంట వచ్చేలాంటి ఫీల్ ఉంటుంది. చివర్లో దర్శకుడు రామ్ వాయిస్ ఓవర్ పిల్లలు అడిగినవన్నీ చేయడం అసాధ్యం కాదని, కానీ పిల్లల అవసరాలను తీర్చే మార్గం కచ్చితంగా ఉంటుందని చెబుతుంది.

జీవితం, పిల్లల పెంపకం గురించి ఆలోచనలు

అన్బు, గోకుల్ ఊహించని ప్రయాణంలో ఎన్నో ఆసక్తికరమైన పాత్రలను కలుస్తారు. వేర్వేరు వ్యక్తిత్వాలను చూస్తారు. అది చక్రవర్తి కావచ్చు, బిచ్చగాడు కావచ్చు, మహానుభావుడు కావచ్చు లేదా గోకుల్ బాల్య ప్రియురాలు, ఆమె భర్త కావచ్చు. ఈ పాత్రలు పరిమిత స్క్రీన్ స్పేస్ కలిగి ఉండవచ్చు కాని మానవ సంబంధానికున్న ప్రాముఖ్యతను బోధిస్తాయి.

ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త బ్రేక్ తీసుకుని హాయిగా తిరిగి వచ్చేలా ఈ సినిమా మంచి ఫీల్ అందిస్తుంది. పిల్లలు అడిగే చిన్న చిన్న పనులు ఎలా చేయగలరో మాట్లాడుతుంది. వారు అడిగే ప్రతి ప్రశ్నకు సింపుల్ గా అయినా సమాధానం చెప్పడం అంత సులభం కాకపోయినా ఆ క్షణాలను ఎంజాయ్ చేయాలని మూవీ చాటుతుంది. ఆ చిన్న క్షణాలను ఆస్వాదించి తిరిగి సందడిగా ఉండే జీవితంలోకి తిరిగి రావడం ఆమోదయోగ్యమే అని స్పష్టం చేస్తోంది.

పరంతు పో సినిమా చూసి, పిల్లలతో కలిసి సమయాన్ని ఆనందంగా గడపండి. జీవితంలోని చిన్న చిన్న విషయాలను ఆస్వాదించడం ఎలాగో ఈ సినిమా నేర్పుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.