|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Parasakthi Song: శ్రీలీల క్రేజీ మూవీ.. రొమాంటిక్‌ సాంగ్‌ వచ్చేసింది!

Published: 06-11-2025, 1:30 PM
Parasakthi Song: శ్రీలీల క్రేజీ మూవీ.. రొమాంటిక్‌ సాంగ్‌ వచ్చేసింది!

శివ కార్తికేయన్‌, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రం నుండి మొదటి రొమాంటిక్ సాంగ్ ‘సింగారాల సీతాకోకవే’ తాజాగా విడుదలైంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ డ్రామా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తోంది.

Key Points

1

శివ కార్తికేయన్‌, శ్రీలీల హీరో, హీరోయిన్లుగా 'పరాశక్తి' చిత్రం.

2

సుధా కొంగర దర్శకత్వం; సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల.

4

జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, రేవంత్, ఢీ పాటను ఆలపించారు.

పరాశక్తి: మూవీ వివరాలు, విడుదల

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్‌(Sivakarthikeyan) , శ్రీలీల(Sreeleela) హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను డాన్‌ పిక్చర్స్‌ సంస్థ అధినేత ఆకాశ్‌ భాస్కర్‌ నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.  సింగారాల సీతాకోకవే అంటూ రొమాంటిక్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ అందించగా..  ఎల్వీ రేవంత్, ఢీ, సీ రోల్డాన్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్‌ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ మ్యూజికల్ లవర్స్‌ను తెగ ‍అలరిస్తోంది. ఇందులో రవిమోహన్‌, అధర్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పొంగల్‌ కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

సింగారాల సీతాకోకవే: పాట విశేషాలు

సంగీతం, తారాగణం వివరాలు

‘సింగారాల సీతాకోకవే’ పాట ఇప్పటికే అభిమానుల మన్నన పొందుతోంది. శ్రీలీల, శివ కార్తికేయన్‌ కెమిస్ట్రీ, జీవీ ప్రకాశ్ సంగీతం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. సంక్రాంతికి ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.