
ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తల్లి కాబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఆమె భర్త రాఘవ్ చద్దాతో కలిసి ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వార్త వైరల్‌గా మారింది.
Key Points
పరిణీతి చోప్రా తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.
ఆమె 2023లో రాఘవ్ చద్దాను వివాహం చేసుకుంది.
బాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం పరిణీతి కొత్త సినిమా ప్రాజెక్టుల్లో లేదు.
పరిణీతి చోప్రా గుడ్ న్యూస్
మరో హీరోయిన్ తల్లి కాబోతుంది. 2023లో రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకున్న ఈమె.. ఓవైపు సినిమాలు చేస్తోంది. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు భర్తతో కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో తోటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.
రాఘవ్ చద్దాతో వివాహం
చోప్రాస్ ఫ్యామిలీ నుంచి పరిణీతి.. 2012 నుంచి బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా తదితర చిత్రాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. చెప్పాలంటే సెన్సేషనల్ హిట్ ‘యానిమల్’లోనూ ఈమెనే తొలుత హీరోయిన్ అనుకున్నారు. కానీ తర్వాత ఆ ఛాన్స్ రష్మికని వరించింది.
ఓ సినిమా, వెబ్ సిరీస్ పూర్తి చేసింది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు. ఈ క్రమంలోనే తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని పరిణీతి బయటపెట్టింది. ఈమె ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2023 సెప్టెంబరులో వీళ్లిద్దరూ ఒకటి కాగా.. ఇప్పుడు రెండేళ్లు ముగేసరికి తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ప్రకటించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.
బాలీవుడ్ స్పందన
పరిణీతి చోప్రా జీవితంలోని ఈ కొత్త అధ్యాయానికి బాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తల్లిదండ్రులుగా వారి జీవితం సంతోషంగా సాగాలని కోరుకుందాం.


