|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం! ‘సూపర్ స్టార్స్ అయినా సరే.. మహిళలను పక్కన పడేస్తారు!’ – పార్వతి బ్రేకింగ్ కామెంట్స్ వైరల్!

Published: 20-05-2026, 4:46 AM
సంచలనం! 'సూపర్ స్టార్స్ అయినా సరే.. మహిళలను పక్కన పడేస్తారు!' – పార్వతి బ్రేకింగ్ కామెంట్స్ వైరల్!
  • పార్వతి తిరువోతు సంచలన ఆరోపణలు: “ఇండస్ట్రీలో మహిళలను ఈజీగా పక్కన పెడతారు.”
  • “ఎంత పెద్ద స్టార్ అయినా సరే, నిజాలు మాట్లాడితే పక్కన పెడతారు” – పార్వతి ఘాటు వ్యాఖ్యలు.
  • తనపై కుట్రలు జరుగుతున్నాయని, కొందరు గ్రూపులుగా ఏర్పడ్డారని పార్వతి షాకింగ్ వెల్లడి.
  • మౌనమే తన బలం అంటున్న పార్వతి. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

టాలీవుడ్, కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న పార్వతి తిరువోతు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. స్టార్ హీరోల నుండి దర్శకుల వరకు అందరినీ కదిలించేలా ఆమె చేసిన ఈ ఘాటు కామెంట్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

మహిళలను వాడుకుని వదిలేస్తారా?

తన సెన్సేషనల్ కామెంట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పార్వతి తీరువోతు(Parvathy Thiruvothu) తమిళ, మలయా చిత్రాల్లో నటించి మెప్పించారు. చివరగా.. ‘తంగలాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నుంచి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె నిత్యం పలు విషయాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా పార్వతి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎంత ప్రతిభ ఉన్నా.. చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయి వసూళ్లు రాబట్టినా.. మహిళలను సులభంగా పక్కన పెట్టేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘మనం ఎంత బాగా నటించినా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించినా.. వ్యవస్థలో మహిళలు కేవలం వాడుకుని వదిలేసే వస్తువులనే భావన బలంగా ఉంది. మనం నిజాలు మాట్లాడి ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తే.. ఎంతపెద్ద సూపర్ స్టార్ అయినా సరే చాలా ఈజీగా పక్కన పెట్టేస్తారు’’ అని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఇండస్ట్రీలోని లోపాలను ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత తనపై విమర్శలు, వ్యతిరేకత ఎక్కువయ్యాయని పార్వతి తెలిపారు.

తన సినిమాలు హిట్ అయి, తన ఫేమ్ పెరిగితే ఇతరులను దోపిడీ చేసేవారికి అవకాశాలు తగ్గుతాయనే భయంతో కొందరు గ్రూపులుగా ఏర్పడ్డారని ఆమె ఆరోపించారు. “మామూలుగా అయితే ఒకరి ముఖం ఒకరు చూసుకోని వారు కూడా, నన్ను టార్గెట్ చేయడానికి ఒకటయ్యారు. పరిశ్రమలో తీవ్రవాదులు, మహిళా ద్వేషుల మధ్య ఉన్న ఐక్యత మరెక్కడా ఉండదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు. ఒకప్పుడు తనపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పాలని అనుకునేదాన్నని, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదనిపించిందని పార్వతి అన్నారు. పెద్ద పెద్ద స్టార్లు భాగమైన విషయాలను ప్రశ్నించడం వల్ల చాలా మందికి తాను నచ్చలేదని, అయినా తన విలువలను వదులుకోలేదని చెప్పారు. తనను తప్పుగా అర్థం చేసుకునేవారికి ఆ స్వేచ్ఛను వదిలేశానని అన్నారు. అందరూ తనను అర్థం చేసుకోవాలనే పట్టింపు తనకు లేదని పేర్కొంది. నిరంతరం పోరాడటం వల్ల తన నటనపై ప్రభావం పడుతోందన్న భావన కలుగుతోందని చెప్పింది. అందుకే ఇప్పుడు తాను మౌనంగా ఉండటమే మంచిదని భావిస్తున్నప్పటికీ… తాను భయపడి వెనక్కి తగ్గినట్లు అందరూ అనుకుంటున్నారని కానీ ఈ మౌనమే తనను మరింత శక్తివంతురాలిని చేసిందని పార్వతి స్పష్టం చేశారు

పార్వతిపై కుట్రలు.. వెనుక ఎవరు?

మౌనమే ఆమె ఆయుధమా?

పార్వతి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్, వైరల్ అప్‌డేట్‌ల కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.