|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ప్రేమ రహస్యం బట్టబయలు! అన్నా లెజ్నోవా సంచలన విషయాలు వెల్లడి!

Published: 08-04-2026, 7:05 AM
పవన్ కళ్యాణ్ ప్రేమ రహస్యం బట్టబయలు! అన్నా లెజ్నోవా సంచలన విషయాలు వెల్లడి!
  • పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై అన్నా లెజ్నోవా ఆసక్తికర వ్యాఖ్యలు.
  • తన భర్త పవన్ కళ్యాణ్ తనను మొదట ప్రపోజ్ చేశారని అన్నా వెల్లడి.
  • ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు.
  • 2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో వీరి పరిచయం మొదలైంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవా ప్రేమ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. తాజాగా అన్నా లెజ్నోవా అభిమానులతో ముచ్చటిస్తూ పవన్ కళ్యాణ్ తననే మొదట ప్రపోజ్ చేశారని వెల్లడించారు. ఈ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అన్నా లెజ్నోవా తొలి స్పందన

Anna Lezhneva:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఈ పేరు వినగానే చాలు చిన్న పిల్లలను మొదలుకొని పెద్దవాళ్ల వరకూ బాడీలో అదొక వైబ్రేషన్.. పవన్ కళ్యాణ్ మేనరిజం చూస్తే ఎంతటి వారైనా దానిని ఫాలో అవ్వాల్సిందే.. అలాంటి పవన్ కళ్యాణ్ తెలుగులో సినిమాలు చేసిన తన మేనరిజంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. భాషతో సంబంధం లేకుండా భారీ పాపులారిటీని అందుకున్న పవన్ కళ్యాణ్ గురించి ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆయన గురించి, ఆయన వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అలాంటిది పవన్ కళ్యాణ్ భార్య స్వయంగా ఆయన వ్యక్తిగత జీవిత విషయాలను పంచుకుంటే ఇంకేమైనా ఉందా.. అభిమానుల ఆనందానికి అవదులు ఉండవు.. అలా పవన్ కళ్యాణ్ తో తన పరిచయం ఎలా మొదలయ్యింది? ప్రేమగా ఎప్పుడు మారింది? అసలు ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారు? అనే విషయాలపై ఆయన భార్య అన్నా లెజినోవా స్పందించారు. ఇక ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మెగా కోడలిగా.. పవన్ కళ్యాణ్ భార్యగా అందరికీ సుపరిచితురాలిగా పేరు దక్కించుకున్న అన్నా లెజినోవా రష్యన్ యువతి అయినప్పటికీ.. భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవలే ఇంస్టాగ్రామ్ ఖాతాను తెరిచి అభిమానులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్న ఈమె.. అనతి కాలంలోనే లక్షలాదిమంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఫాలోవర్లతో “ఆస్క్ మీ ఎనీథింగ్” అనే ఒక చిట్ చాట్ సెషన్ నిర్వహించారు అన్నా లెజినోవా. ఈ నేపథ్యంలోనే అభిమానులు అడిగిన ఎన్నో వ్యక్తిగత ప్రశ్నలకు.. ఎంతో ఓపికగా ఆసక్తికరమైన సమాధానాలను ఇచ్చారు.

ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు

ఇక అందులో భాగంగానే ఒక అభిమాని..” వదిన.. మీ ఇద్దరిలో ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు?” అని ప్రశ్నించగా.. అన్నా ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె “మీ అన్నయ్య” అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమెపై తనకున్న ప్రేమను మొదట వ్యక్తపరిచారు అన్న విషయాన్ని అన్నా లెజినోవా ఇన్నాళ్లకు బయటపెట్టారు. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయం తెలిసి అన్నయ్యే వదినకు మొదటగా ప్రపోజ్ చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే 2011లో వచ్చిన ‘తీన్మార్’ సినిమా షూటింగ్ సెట్లో వీరి మధ్య పరిచయం మొదలయ్యింది. ఈ సినిమాలో అన్నా ఒక చిన్న పాత్రలో కనిపించినా ఆ తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారిందట . అయితే అలా స్నేహంగా మారడానికి కారణం ఇద్దరి ఆలోచనలు, వ్యక్తిత్వాలు ఒకటే కావడం. ఇక తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న అన్నా లెజినోవాతో జీవితం పంచుకుంటే సవ్యంగా ఉంటుంది అనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాకు తన ప్రేమ విషయాన్ని తెలియజేశారట. ఇక ఆ తర్వాతే ఆ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళింది.

పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేశారా?

ఇకపోతే ఇదే సెషన్ లో తనకు ఆరు భాషలు తెలుసని , అయితే ఇంగ్లీషులో మాట్లాడడం తనకు సౌకర్యంగా ఉంటుందని, తెలుగు భాష అంటే తనకు చాలా ఇష్టమని , అంతేకాదు ప్రతిరోజు కొన్ని తెలుగు కొత్త పదాలను కూడా నేర్చుకుంటున్నట్లు తెలిపింది అన్నా లెజినోవా.

పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నోవా పట్ల ఎంత ప్రేమగా ఉంటారో ఈ విషయం ద్వారా తెలుస్తోంది. అభిమానులు కూడా ఈ విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.