
హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానిస్తూ, ఈ సినిమా డబ్బు కోసం కాదని, ధైర్యం, సాహసం, న్యాయం కోసం చేస్తున్నానని అన్నారు. తన దగ్గర ఆయుధాలు లేవని, అభిమానులే తన బలం అని పేర్కొన్నారు.
Key Points
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా డబ్బు కోసం కాదని, ధైర్యం, సాహసం, న్యాయం కోసం అని పేర్కొన్నారు.
ఆయన తన దగ్గర ఆయుధాలు లేవని, గూండాలు లేరని, కానీ అభిమానులే గుండెల్లో ఉన్నారని తెలిపారు.
సినిమాలోని హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోందని, ఆమె కారణంగానే ప్రెస్ మీట్ కు వచ్చానని పవన్ తెలిపారు.
పవన్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశానని, మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.
హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్
ఈ సినిమా డబ్బు కోసమో, రికార్డుల కోసమో కాదు.. ఇది ధైర్యం కోసం, సాహసం కోసం, న్యాయం కోసం అని పవన్ కల్యాణ్ అన్నారు. తన దగ్గర ఆయుధాల్లేవు, గూండాలు లేరు అని వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ హరిహర వీరమల్లు మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం (జులై 21) రాత్రి హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ మూవీ జులై 24న రిలీజ్ కానుంది.
హరి హర వీరమల్లు ప్రి రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు పవన్ కల్యాణ్ థ్యాంక్యూ చెప్పారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చాక మంచి మిత్రుడిని సంపాదించుకున్నా. ఈ ఈవెంట్ కు వచ్చిన కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు థ్యాంక్యూ. భీమ్లా నాయక్ మూవీ రిలీజైనప్పుడు పవన్ సినిమా టికెట్ ను 10, 15 రూపాయలు చేశారు. అయినా ఆగిపోలేదు. మనల్ని ఎవడ్రా ఆపేది అని చెప్పా. ఇది డబ్బు కోసమో, రికార్డుల కోసమో కాదు. ధైర్యం,సాహసం, న్యాయం కోసం నిలబడ్డాం. పవన్ కల్యాణ్ ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించలేదు’’ అని పవన్ అన్నారు.
పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘ఈ స్థాయిలో నేను నిలబడటానికి కారణం మీరే (ఫ్యాన్స్), రాజకీయాల్లో పడి లేచినా కారణం మీరే. నా దగ్గర ఆయుధాల్లేవు, గూండాలు లేరు. గుండెల్లో అభిమానులే ఉన్నారు. చిత్ర పరిశ్రమకు వచ్చి సుమారు 30 ఏళ్లవుతోంది. వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చేవ మాత్రం చావలేదు. ఒక హిట్ ఇవ్వమని ఓ అభిమాని అడిగితే.. హరీశ్ శంకర్ వల్ల గబ్బర్ సింగ్ వచ్చింది. ఇక జానీ మూవీ ఫెయిల్ అయినా అభిమానులు నన్ను వదల్లేదు. కానీ అన్ని బంధాలూ డబ్బుతో ముడిపడి ఉంటాయి కదా. నా రెమ్యునరేషన్ తిరిగిచ్చేశా’’ అని పవన్ చెప్పారు.
డబ్బు కాదు, ధైర్యం, సాహసం, న్యాయం కోసం సినిమా
‘‘మంచి సినిమా చేయాలని ఎదురు చూస్తున్న సమయంలో జాగర్లమూడి క్రిష్ ఈ కథ చెప్పారు. కీరవాణి మ్యూజిక్ లేకపోతే హరిహర వీరమల్లు లేదు. ఈ సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఆ అమ్మాయి కారణంగానే నేనూ ప్రెస్ మీట్ కు వచ్చా. హరి హర వీరమల్లు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఈ సినిమా ద్వారా మీరు కోరుకునే సక్సెస్ నేనూ కోరుకుంటున్నా. మీకు నచ్చితే బాక్సాఫీస్ బద్దలు కొట్టేయండి. మీరే నా బలం. ఈ గుండె మీ కోసమే కొట్టుకుంటోంది’’ అని పవన్ పేర్కొన్నారు.
చివరగా, పవన్ కల్యాణ్ తన అభిమానులే తన బలం అని, వారి కోసం తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.


