|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Pawan Kalyan : రోజంతా షూట్ చేసి.. రాత్రికి నాలుగు గంటల్లో మొత్తం పని పూర్తిచేసిన పవన్.. అభినందించాల్సిందే..

Published: 29-05-2025, 5:55 AM
Pawan Kalyan : రోజంతా షూట్ చేసి.. రాత్రికి నాలుగు గంటల్లో మొత్తం పని పూర్తిచేసిన పవన్.. అభినందించాల్సిందే..

రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు, రోజంతా OG సినిమా షూటింగ్ చేసి రాత్రి నాలుగు గంటల్లో డబ్బింగ్ పూర్తి చేశారు.

Key Points

1

పవన్ కళ్యాణ్ OG సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

2

హరిహర వీరమల్లు సినిమా డబ్బింగ్‌ను నాలుగు గంటల్లో పూర్తి చేశారు.

4

ఫ్యాన్స్, ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ కష్టపాటును అభినందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ యొక్క అవిశ్రాంత కృషి

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయడానికి డేట్స్ ఇస్తున్నారు. ఇటు సినిమాలు, అటు ప్రభుత్వ పాలనతో విరామం లేకుండా పరిగెడుతున్నారు. ప్రస్తుతం పవన్ OG షూటింగ్ లో ఉన్నారు. ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తిచేయగా ఈ సినిమా జూన్ 12 రిలీజ్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు డబ్బింగ్ చెప్పారు. నిన్నంతా పవన్ OG షూట్ చేసి ఆ తర్వాత రాత్రికి 10 గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టారు. కేవలం నాలుగు గంటల్లోనే సినిమా అంతా డబ్బింగ్ పూర్తిచేసేసారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా హీరోలు డబ్బింగ్ అంటే సినిమా మొత్తానికి ఒక మూడు నాలుగు రోజులు కూడా తీసుకుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఒక రోజంతా తీసుకుంటారు డబ్బింగ్ కోసం.

నాలుగు గంటల్లో డబ్బింగ్ పూర్తి

అలాంటిది పవన్ పొద్దునంతా షూట్ చేసి రాత్రికి మళ్ళీ కంటిన్యూగా నాలుగు గంటలు డబ్బింగ్ చెప్పి సినిమా మొత్తం పూర్తి చేసాడంటే గ్రేట్ అంటున్నారు. ఇలా పవన్ పగలు రాత్రి లేకుండా కష్టపడుతుండంతో అభినందించాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు.

అభిమానుల ప్రశంసలు

పవన్ కళ్యాణ్ యొక్క కష్టపాటు, నిబద్ధత చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సినిమా పరిశ్రమలో ఇలాంటి అంకితభావం చాలా అరుదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.