|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kohinoor : కోహినూర్ డైమండ్ మళ్ళీ మన దేశానికి తిరిగి రావాలి.. పవన్ వ్యాఖ్యలు వైరల్..

Published: 23-07-2025, 6:43 AM
Kohinoor : కోహినూర్ డైమండ్ మళ్ళీ మన దేశానికి తిరిగి రావాలి.. పవన్ వ్యాఖ్యలు వైరల్..

హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ కోహినూర్ డైమండ్ గురించి ప్రస్తావించారు. కోహినూర్ మన దేశానికి తిరిగి రావాలని ఆయన కోరిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

Key Points

1

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో కోహినూర్ డైమండ్ గురించి మాట్లాడారు.

2

కోహినూర్ డైమండ్ భారతదేశానికి తిరిగి రావాలని పవన్ కోరుకుంటున్నారు.

4

పవన్ కళ్యాణ్ యొక్క వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పవన్ కళ్యాణ్ యొక్క కోహినూర్ వ్యాఖ్యలు

Kohinoor : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమా కోహినూర్ డైమండ్ గురించి, హిందువుల మీద మొగల్ రాజు ఔరంగజేబు చేసిన దాడి గురించి, అలాంటివాటికి హరిహర వీరమల్లు ఎలా ఎదుర్కున్నాడు అని ఉండబోతుందని పవన్, దర్శకుడు ప్రమోషన్స్ లో చెప్పారు.

కోహినూర్ డైమండ్ కథ అనగానే సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. కృష్ణా నది తీరాన దొరికిన కోహినూర్ నిజాం నవాబుల దగ్గరకు వెళ్లి అక్కడ నుంచి మొగల్స్ దగ్గరకు వెళ్లి తర్వాత బ్రిటిష్ వాళ్ళ వద్దకు వెళ్లి ఇప్పుడు లండన్ లో ఉంది. గతంలో పలుమార్లు కోహినూర్ డైమండ్ ఇండియాకు తిరిగి ఇచ్చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. పలువురు డిమాండ్ చేసారు.

హరిహర వీరమల్లు సినిమా మరియు కోహినూర్

తాజాగా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ నేడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా కోహినూర్ గురించే. మన దగ్గర కృష్ణా నది తీర ప్రాంతంలో దొరికిన ఒక అరుదైన వజ్రం. ఇప్పుడు లండన్లో ఉంది. కోహినూర్ మన దేశానికి తిరిగి రావాలి. దానిపై చర్చ జరగాలి. ఆ చర్చకు ఈ సినిమా ఒక కారణం అవుతుంది. సినిమా చూసాక కోహినూర్ డైమండ్ గురించి చర్చ జరుగుతుంది అని అన్నారు.

కోహినూర్ డైమండ్ తిరిగి రావాలనే డిమాండ్

మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత కోహినూర్ డైమండ్ గురించి ఏ రేంజ్ లో చర్చ జరుగుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం వద్దకు కోహినూర్ ని తిరిగి రప్పించాలనే ప్రతిపాదన ఏమైనా చేస్తారేమో చూడాలి.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కోహినూర్ డైమండ్ పై చర్చ మళ్ళీ మొదలైంది. ఈ సినిమా ద్వారా కోహినూర్ తిరిగి రావడంపై జాతీయస్థాయి చర్చ జరుగుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.