|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. హరిహర వీరమల్లు మరోసారి వాయిదా?

Published: 03-06-2025, 7:56 AM
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. హరిహర వీరమల్లు మరోసారి వాయిదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విడుదలకు కొద్ది రోజుల ముందు వచ్చిన ఈ వార్త అభిమానులను షాక్‌కు గురిచేసింది.

Key Points

1

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడినట్లు వార్తలు.

2

సినిమా విడుదలకు తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉండగా ఈ వార్త ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.

4

జూన్ 20 లేదా జులై 4న సినిమా విడుదల అవుతుందని ప్రచారం.

వాయిదా వార్తలతో ఫ్యాన్స్‌ నిరాశ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్‌కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. హరిహర వీరమల్లు చిత్రం మరోసారి వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరిగ్గా తొమ్మిది రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మరోసారి వాయిదా పడబోతున్నట్లు వార్తలు వస్తుండటం ఫ్యాన్స్‌కు జీర్ణించుకోలేని అంశంగా మారింది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని మొదలుపెట్టగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం.రత్నం(A.M.Ratnam) సమర్పణలో ఏ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా విడుదల సమీపిస్తోన్న నేపథ్యంలో ఇటీవల ప్రమోషన్స్‌లో వేగం పెంచిన విషయం తెలిసిందే. ఈనెల 8న తిరుపతిలో హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరగనుందని.. దానికి చిరంజీవి, రజినీకాంత్ గెస్టులుగా హాజరవుతారని టాక్ వచ్చింది.

అయితే ఈలోపే మరోసారి వీరమల్లు వాయిదా అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సీజీ వర్క్ అవ్వలేదని కొందరు అంటుంటే.. బయ్యర్లు దొరకలేదని మరికొందరు చెబుతున్నారు. 9 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయలేదని, ఇంకా ట్రైలర్ కట్ కూడా రెడీ అవ్వలేదని అంటున్నారు. జూన్ 12న కాకపోతే జూన్ 20 లేదా? జులై 4వ తేదీకి వీరమల్లు వాయిదా పడనుందని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

విడుదలకు కారణాలు తెలియని ప్రశ్నలు

جدید విడుదల తేదీ ఎప్పుడు?

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.