|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బాలయ్య సినిమాను 100 సార్లు చూసిన పవన్ కళ్యాణ్! ఇది కదా మాస్ అంటే!

Published: 09-02-2026, 9:05 AM
షాకింగ్: బాలయ్య సినిమాను 100 సార్లు చూసిన పవన్ కళ్యాణ్! ఇది కదా మాస్ అంటే!
  • పవన్ కళ్యాణ్ మనసు దోచిన బాలయ్య చిత్రం ‘సమరసింహా రెడ్డి’!
  • వందసార్లు చూసినా తరగని పవర్ స్టార్ అభిమానం, ఇది కదా బాలయ్య క్రేజ్ అంటే!
  • ఫ్యాక్షన్ కథతో బాలయ్య నట విశ్వరూపం, పవన్ కళ్యాణ్ ఫిదా!
  • బాలయ్య డైలాగ్ డెలివరీకి పవన్ కళ్యాణ్ జై కొట్టిన సందర్భాలు అనేకం!

టాలీవుడ్ లో నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ బాలయ్య సినిమాను వంద సార్లు చూశారంటేనే అర్ధం చేసుకోవచ్చు వారి మధ్య అనుబంధం ఎటువంటిదో!

పవన్ కళ్యాణ్ కి బాలయ్య సినిమా అంటే ఎందుకంత ఇష్టం?

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ‌- మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం ఇప్పటిది కాదు. వీరిద్దరు మంచి అనుబంధం కలిగి ఉన్నా విషయం తెలిసిందే. సినీ, రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో వీరి స్నేహం చర్చనీయాంశం అవుతూనే ఉంది. వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా, ప్రస్తుతం రాజకీయంగా కూడా వీరిద్దరూ మంచి మిత్రులుగా ఉన్నారు. ఇక బాలయ్య హోస్ట్ గా వచ్చిన అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ సందడి చేసిన విషయం కూడా తెలిసిందే.

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ స్వభావంలో స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటారని, నచ్చిన విషయం నచ్చిందని, నచ్చని విషయం నచ్చలేదని నేరుగా చెప్పే వ్యక్తులుగా గుర్తింపు కలిగి ఉన్నారు. ఇదే స్వభావం ఈ హీరోలిద్దరి మీద నెగెటివిటీకి కూడా కారణం అయ్యింది. పరత్యర్ధులు విమర్శించడానికి పాయింట్ అయ్యింది. ఇక ఈ ఇద్దరు హీరోలు ఒకరినొకరు బాగా గౌరవించుకుంటారు. ఒకరి సినిమాపై మరొకరు ప్రశంసించుకుంటారు కూడా. ఇక పవన్ కళ్యాణ్ కు బాలకృష్ణ సినిమాలంటే చాలా ఇష్టమని, ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలను అతను చూస్తాడని సమాచారం.

సమరసింహా రెడ్డి సినిమానే పవన్ ఎందుకు అంతలా చూస్తారు?

అందులో ప్రత్యేకంగా సమరసింహా రెడ్డి సినిమా తనకు ఎంతో ఇష్టమని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో బాలయ్య బాబు తన పూర్తిస్థాయి నటనను ప్రదర్శించారని, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అద్భుతంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఫ్యాక్షన్ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో బాలకృష్ణ నటన, డైలాగ్ డెలివరీ, మేనరిజాలు తనను బాగా ఆకట్టుకున్నాయని పవన్ కళ్యాణ్ భావించినట్లు తెలుస్తోంది.

ఇక మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సమరసింహా రెడ్డి సినిమాను పవన్ దాదాపు ఓ 100 సార్లు చూశానని పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల వద్ద తరచూ చెప్పుకుంటూ ఉంటారట. ఒకే సినిమాను ఇన్ని సార్లు తిరిగి చూడడం సాధారణ విషయం కాదని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇది బాలకృష్ణపై పవన్ కళ్యాణ్‌కు ఉన్న అభిమానానికి నిదర్శనం అంటున్నారు అభిమానులు. ఈ విషయంలో నిజం ఎంతో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం తెగ వైరల్ అవుతోంది.

బాలయ్య నటనకు పవన్ కళ్యాణ్ ఫిదా.. ఇది నిజమా?

65 ఏళ్ల వయసులో నందమూరి నటసింహం బాలయ్య బాబు దూసుకెళ్తున్నాడు.. వరుస విజయాలతో సందడి చేస్తున్నాడు. రీసెంట్ గా అఖండ2 తో పర్వాలేదనిపించాడు బాలకృష్ణ. నెక్ట్స్ మలినేని గోపీచంద్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు బాలకృష్ణ. ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం.

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ల స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుందాం. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.