
📌 Key Points
- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ అప్డేట్: డైరెక్షన్ సురేందర్ రెడ్డి!
- వక్కంతం వంశీ కథతో రామ్ తాళ్లూరి నిర్మాణంలో గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ!
- ఉగాదికి మూవీ ప్రారంభం, వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు భారీ ప్లాన్!
- ఫుల్ గడ్డంతో పవన్ కళ్యాణ్ న్యూ లుక్ వైరల్.. సినిమా కోసమేనా ఈ గెటప్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! ఆయన తదుపరి సినిమాపై ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్త పవన్ అభిమానులకు పండగే.
ఫుల్ గడ్డంతో పవన్ కళ్యాణ్.. కారణం ఇదేనా?
Pawan Kalyan : పవర్ స్టార్ యాక్ట్ చేసిన మూవీ ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇంతలోనే పవన్ చేయబోయే నెక్స్ట్ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ మూవీని లాంచింగ్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది.
రామ్ తాళ్లూరి నిర్మాతగా, వక్కంతం వంశీ కథతో సురేందర్ రెడ్డి డైరెక్టర్‌గా పవన్ ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై లేటెస్ట్‌గా టాలీవుడ్‌లో ఓ టాక్ వినిపిస్తుంది. ఉగాదికి సినిమాను ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలన్నది ప్లాన్. ఉగాది రోజు సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం కూడా జరుగుతుందని సమాచారం.
సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో పవన్ మాస్ మూవీ!
అయితే ఇప్పుడు పవన్ లుక్ గురించి టాలీవుడ్‌లో పెద్ద చర్చనే జరుగుతుంది. ఈ మధ్య పవన్ కల్యాణ్ ఫుల్ గడ్డంతో కనిపిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ రోజూ ఫుల్ గడ్డంతోనే కనిపిస్తున్నారు గత కొన్ని రోజులుగా. పవన్ గడ్డంకు సినిమాకు చాలా లింక్ ఉందంటూ టాక్ నడుస్తోంది. సురేందర్‌రెడ్డి పవన్ చేయబోతున్న మూవీలో మాస్ గ్యాంగ్‌స్టర్‌గా పవన్ నటించబోతున్నాడని, మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఉగాదికి ప్రారంభం.. సంక్రాంతికి విడుదల!
ఈ మధ్య ధురంధర్, టాక్సీక్ మూవీస్‌లో హీరోలు ఫుల్ గడ్డంతో మెరిశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఫుల్ బియర్డ్‌తో పవర్ ఫుల్ యాక్షన్ రోల్‌లో యాక్ట్ చేయబోతున్నారట. ఇంత ఎక్కువ గడ్డం పెంచి పవన్ ఏ సినిమా చేయలేదు. సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో చేసే సినిమాలో పవన్ లుక్ మాత్రం అట్రాక్టివ్‌గా ఉంటుందంటున్నారు. మరి పవన్ గడ్డం లుక్స్ సురేందర్ రెడ్డి సినిమా కోసమేనా అంటే ఎదురుచూడాల్సిందే.
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించి వస్తున్న ఈ వార్తలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


