|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వీరోచిత త్యాగానికి ప్రతిబింబం.. ఇక్కిస్

Published: 27-02-2026, 8:35 PM
వీరోచిత త్యాగానికి ప్రతిబింబం.. ఇక్కిస్
  • 1971 భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో 21 ఏళ్ల యువ సైనికుడి వీరోచిత గాథ!
  • ధర్మేంద్ర నటన, శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
  • యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగభరిత డ్రామా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి.
  • దేశభక్తి, కుటుంబ అనుబంధాల కలయికతో ‘ఇక్కిస్’ చిత్రం తెరకెక్కింది.

టాలీవుడ్ లేటెస్ట్ మూవీ అప్డేట్! ఇక్కిస్ మూవీ 1971 యుద్ధంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఒక సైనికుడి వీరోచిత త్యాగాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించనున్నారు. సినిమా ఎలా ఉందో చూద్దాం!

1971 యుద్ధ నేపధ్యం: ఇక్కిస్ మూవీ అప్డేట్స్

ఏ కాలంలో అయినా సైనిక జీవితం సాహ సోపేతమైంది. ప్రాణాలను తృణప్రాయంగా భావించి యుద్ధ రంగంలో దుమికే యువ సైనికులపై ఎవరు సినిమాలు తీసినా అది వీరోచితంగానే కాదు. రోమాంచితంగా కూడా ఉంటుంది.

ఇంకా శిక్షణ కూడా పూర్తిచేయని 21 ఏళ్ల నవ యువకుడు 1971 నాటి భారత్, పాక్ యుద్ధంలో తప్పని సరై భాగం కావలసి వస్తే.. దేశం కోసం సర్వస్వం అర్పించా‌ల్సిన అవసరం వచ్చినప్పుడు చిరునవ్వుతో ఆత్మత్యాగానికి పాల్పడే క్షణాలు ఆ సైనికుడి జీవితంలో చిరు నవ్వును, గర్వాన్ని మాత్రమే ప్రదర్శించి ముగిసిపోతే.. ఆ అనుభూతిని వెండితెరపై తాజాగా చూపించిన చిత్రం ‘ఇక్కిస్’.

భారత సైన్యంలో బ్రిగేడియర్‌ ఎం.ఎల్ ఖేత్రపాల్ (ధర్మేంద్ర) రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. పాకిస్తాన్‌లో ఉన్న మిత్రులతో జ్ఞాపకాలు పంచుకోవడానికి లాహోర్ వెళతాడు. వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ యుద్ధంలో తన కుమారుడు అరుణ్ ఖేత్రపాల్ నేలకొరిగిన ప్రదే శానికి వెళతాడు. 1971లో భారత్, పాక్ యుద్ధంలో 21 సంవత్సరాల సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ (అగస్త్య నంద) చేసిన సాహసం ఏంటి? యుద్ధ భూమిలో అడుగు పెట్టాక తనకు ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే ఈ చిత్ర కథ.

ధర్మేంద్ర నటన: హైలైట్స్ ఏంటి?

ఈ సినిమా దేశభక్తి పేరుతో భయంకరమైన శబ్దాలు చేస్తూ, చేంతాడంత పొడవు డైలాగులు దంచుతూ యువతలో ఆవేశాన్ని రంగరించి పోసే సినిమా కాదు. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ వాస్తవ సంఘటనలకే ప్రాముఖ్య‌మిచ్చి భావోద్వేగాలతో కూడిన డ్రామాను ఉత్కంఠతో చూపే ప్రయత్నం చేశారు.. 21వ జన్మదినం జరుపుకుంటున్న రోజే యుద్ధానికి వెళ్లమని అరుణ్‌ను అధికారులు ఆదేశిస్తే, భారత్‌లోకి చొరబడుతున్న యుద్ధ ట్యాంకులను అడ్డుకునేందుకు ఆర్మీ అధికారులు చేసే సాహసాలు సినిమాను మరో స్థాయికి తీసుకె‌ళ తాయి. తోటి సైనికుల మరణిస్తే భావోద్వేగాలకు లొంగిపోక పోవడం, యుద్ధంలో పట్టుబడిన పాక్ సైనికులను బందీలు చేయ్యాలి తప్ప చంపగకూడదంటూ భారత ఆర్మీ చూపే నిబద్ధత వీక్షకులను అలరింపజేస్తుంది.

ఈ చిత్రం దేశభక్తి వీరత్వానికి మించి యుద్ధం కలిగించే శాశ్వత వ్యక్తిగత కుటుంబ గాయాన్ని సున్నితంగా అన్వేషిస్తుంది. ఛాతీని విరిచి కొట్టుకునే దేశభక్తి, హైపర్-యాక్షన్ డ్రామా యుగంలో, యూనిఫాం నుండి సైనికుల జీవితాల్లోకి మనల్ని తీసుకెళ్తు‌న్న విధానం అద్భుతం. ముఖ్యంగా అకాడమీలో వారి రోజులు, ఒకరితో ఒకరు పంచుకునే స్నేహం, వారి ఆశయం, వారి మానవీయ స్పర్శను చూపడమే కాదు.. ఒక సైనికుడి కుటుంబ హృదయం ఉక్కుతో ఎలా తయారైందో కూడా ఇది వర్ణిస్తుంది. అరుణ్ తాను యుద్ధానికి వెళ్తున్నానని తన తల్లికి చెప్పడానికి ఇంటికి వచ్చినప్పుడు, ఆమె చెప్పేదంతా ‘ఖానా ఖా కే జానా’ అని మాత్రమే.

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం: ఎలా ఉంది?

ఈ చిత్రం, ఎలాంటి సంకోచం లేకుండా, యుద్ధం ఎప్పటికీ మంచి చేయదని చెబుతుంది. బహుశా బజరంగీ భాయిజాన్ తర్వాత, మంచి ఉద్దేశాలతో కూడిన పాకిస్తానీ పాత్రలను తెరపై చూడగలుగుతాం. పాకిస్తాన్ మాజీ అధికారి భారతీయ బ్రిగేడియర్‍ని తమ దేశంలోకి ఆహ్వానిస్తే యుద్ధంలో కాలు పోగొట్టుకున్న అతడి కుమారుడు ఇండియా వాడిని ఎందుకు రప్పించావు అని నిలదీస్తాడు. అప్పుడు దర్మేంద్ర ‘నువ్వు యుద్ధంలో కాలు మాత్రమే పోగొట్టుకున్నావు. నేను కొడుకునే పొగొట్టుకున్నాను’ అంటాడు. పాక్ అధికారి కుమారుడు అప్పుడు కానీ మారడు. యుద్ధం ఇరుదేశాల పాలకులకు మాత్రమే ప్రయోజనం కలిగిస్తుంది కానీ ఆ దేశాల ప్రజలే బాధితులవుతారని ఆ దృశ్యం స్పష్టంగా చూపిస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో దర్శకుడి దృక్పథాన్ని నిశ్శబ్దంగా ఆరాధించేలా చేస్తుందీ చిత్రం. ఆ దృశ్యం ధర్మేంద్ర స్వరంలో బిగ్గరగా ప్రతిధ్వనిస్తుంది.. యుద్ధం వల్ల కలిగే గాయాలు ఎప్పుడూ మానవు, ఎందుకంటే ఎవరో ఒకరు వాటిని తిరిగి తెరుస్తూనే ఉంటారు. పంట, వంశం రెండూ నాశనం అవుతాయి. ఇది ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు, బహుశా మనం దానిని ఆపాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే.

సైన్యానికి, బహుశా ధర్మేంద్రకు వందనం అర్పిస్తూ ఉర్దూ కవి కైఫీ అజ్మీ రాసిన ‘కర్ చలే హమ్ ఫిదా’ పాటతో ఇక్కిస్ ప్రారంభమవుతుంది. హకీకత్ (1964)లో ఈ పాట ప్రసిద్ధి చెందింది. ఈ క్షణాలు భారతీయ సినిమాకు సంబంధించి హీ-మ్యాన్ వదిలి పెట్టిన శూన్యతను నిశ్శబ్దంగా నొక్కి చెబుతున్నాయి. యుద్ధంలో తన చిన్న కొడుకును కోల్పోయిన తండ్రిగా అతను నటించాడు, కానీ తన దుఃఖాన్ని యుద్ద ఉన్మాదం వైపు మళ్లించడానికి బదులుగా, మాజీ సైనిక అధికారిగా అతని పాత్ర యువ ప్రాణాలను బలి గొంటున్న రాజకీయ పరిస్థితులను తృణీకరిస్తుంది. ఇది చాలా మానవీయంగా అనిపించే భావోద్వేగం, బహుశా ఈ చిత్రం చాటే బలమైన నైతిక వైఖరి ఇదే.

ఇక్కిస్ మూవీ దేశభక్తిని చాటి చెప్పే ఒక గొప్ప ప్రయత్నం. యుద్ధం యొక్క కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.