|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! రజనీకాంత్ ‘జైలర్ 2’లో మెరవనున్న పవర్ స్టార్!?

Published: 10-04-2026, 12:05 PM
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! రజనీకాంత్ 'జైలర్ 2'లో మెరవనున్న పవర్ స్టార్!?
  • పవన్ కళ్యాణ్ ‘జైలర్ 2’లో గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్!
  • రజనీకాంత్‌తో పవన్ స్క్రీన్ షేరింగ్? ఇది నిజంగా పూనకాలే తెప్పిస్తుంది!
  • హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టపోయింది.
  • సురేందర్ రెడ్డితో సినిమా స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదు, పవన్ డేట్స్ కోసం ఎదురుచూపులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీకాంత్ నటించిన జైలర్ 2 సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జైలర్ 2లో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. హరీష్‌ శంకర్‌ రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో దారుణమైన పరాజయం చెందింది. ఇటీవల కాలంలో పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` మూవీ ఫ్లాప్‌ అయితే, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` దారుణమైన పరాజయం చెందింది. ఈ సినిమా ద్వారా సుమారు రూ.70-80కోట్లు పోయినట్టు సమాచారం.

పవన్‌ కళ్యాణ్‌ నెక్ట్స్ సినిమాకి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు చేసిన `హరి హర వీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రాలు గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్ లు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత టైమ్‌ చూసుకుని వీటి షూటింగుల్లో పాల్గొన్నారు. సినిమాలు పూర్తి చేశారు. వీటిలో ఒక్క `ఓజీ`నే బాగా ఆడింది. మిగిలినవి అంతగా మెప్పించలేదు. అయితే నెక్ట్స్ ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తాడు? ఎప్పుడు సినిమా చేస్తాడనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ముందు కమిట్‌ మెంట్‌ ప్రకారం సురేందర్‌ రెడ్డితో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇది స్క్రిప్ట్ ఫైనల్‌ కాలేదు. కథ ఓకే అయ్యాక, పవన్‌ డేట్స్ ఇస్తే పట్టాలెక్కుతుంది. లేదంటే అది ప్రశ్నార్థకమే. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో పవన్‌ ఎలా డేట్స్ అడ్జెస్ట్ చేస్తాడనేది ప్రశ్న.

ఉస్తాద్ భగత్ సింగ్ పరాజయం!

ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించిన ఒక షాకిచ్చే వార్త, పూనకాలు తెప్పించే మ్యాటర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. ఇది పెద్ద కామెడీగా ఉండటమే కాదు, టూ క్రేజీగా ఉంది. పవన్‌ కళ్యాణ్‌.. `జైలర్‌ 2`లో గెస్ట్ రోల్‌ చేస్తున్నాడనే వార్త దుమ్ముదుమారం రేపుతుంది. పవన్‌ కళ్యాణ్‌.. `జైలర్‌ 2`లో నటించడమనేది ఇంపాజిబుల్‌. అసలు ఆయన సినిమాలు చేయడానికే టైమ్‌ లేదంటే ఇక గెస్ట్ రోల్స్ ఎలా చేస్తాడనేది ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు, పైగా పవన్‌ ఇలాంటి గెస్ట్ రోల్స్ కి ప్రయారిటీ ఇవ్వరు. కానీ `జైలర్‌ 2`కోసం మేకర్స్ ఆయన్ని అప్రోచ్‌ అయ్యారని అంటున్నారు.

సురేందర్ రెడ్డి సినిమాకు ఇంకాస్త టైం?

రజనీకాంత్‌ హీరోగా నటించే ఈ మూవీకి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకుడు. ఇందులో మోహన్‌లాల్‌, శివ రాజ్‌ కుమార్‌ క్యామియో రోల్స్ చేస్తున్నారు. హిందీ నుంచి షారూఖ్‌ ఖాన్‌ నటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన తప్పుకున్నారట. ఆయన స్థానంలో పవన్‌ కనిపిస్తారంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. ఇది చూసి అభిమానులు నవ్వుకుంటున్నారు. ఈ రూమర్‌ క్రియేట్‌ చేసినోడికి దెండం పెట్టాలని, ఫస్ట్ ఈ ఐడియా రావడమే గ్రేట్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా ఇది పెద్ద రచ్చ అవుతుంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఇది క్రేజ్‌ కోసం క్రియేట్‌ చేసిందే తప్ప, ఇందులో నిజం లేదని టాక్‌. నిజం ఏంటో గానీ వినడానికి మాత్రం అదిరిపోయేలా ఉంది. ఇక `జైలర్‌ 2` సినిమాపై రజనీకాంత్‌ స్పందించారు. ఎయిర్‌పోర్ట్ లో ఆయన్ని మీడియా కలిసింది. ఈ సందర్భంగా `జైలర్‌ 2` మూవీ చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయ్యిందని, రిలీజ్‌ డేట్ నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందని తెలిపారు. అలాగే కమల్‌ హాసన్‌తో చేస్తున్న సినిమా ఆగస్ట్ లో ప్రారంభమవుతుందని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ జైలర్ 2 లో నటిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఈ వార్తపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.