|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Pawan Kalyan : సత్యసాయి దర్శనం కోసం చిరంజీవిని అడిగి మరీ వచ్చిన హాలీవుడ్ స్టార్ యాక్టర్.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Published: 19-11-2025, 9:18 PM
Pawan Kalyan : సత్యసాయి దర్శనం కోసం చిరంజీవిని అడిగి మరీ వచ్చిన హాలీవుడ్ స్టార్ యాక్టర్.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్ నటుడు స్టీవెన్ సీగల్ దాదాపు 20 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా అడిగి మరీ సత్యసాయి బాబా దర్శనం చేసుకున్నారని పవన్ వెల్లడించారు. ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

2

పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు వంటి ప్రముఖులు హాజరయ్యారు.

4

సత్యసాయి, చిరంజీవి, స్టీవెన్ సీగల్ కలిసి ఉన్న అరుదైన పాత ఫోటో వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan : బుధవారం నాడు పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సచిన్, ఐశ్వర్య రాయి, నారా లోకేష్.. ఇలా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చెప్పిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది.(Pawan Kalyan)

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సీగల్ దాదాపు 20 సంవత్సరాల క్రితం మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మరీ నేను బాబా గారిని కలవాలి అన్నారు. బెంగుళూరుకు వచ్చి అక్కడ్నుంచి ఇక్కడికి వచ్చి బాబాగారి ఆశీస్సులు తీసుకున్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈయన గురించి అక్కడిదాకా వెళ్ళింది అనుకునేవాడిని. వెనుకబడిన అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇలాంటి జన్మ తీసుకున్నారు అంటే మహానుభావుడు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అభివృద్ధికి పాటుపడ్డారు అని అన్నారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

చిరంజీవి ద్వారా సత్యసాయిని కలిసిన స్టీవెన్ సీగల్

స్టీవెన్ సీగల్ ఒకప్పటి హాలీవుడ్ స్టార్ యాక్షన్ హీరో. డైరెక్టర్, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కూడా. 1988 నుంచి 2019 వరకు ఎన్నో సినిమాలతో మెప్పించాడు. ప్రస్తుతం వయోభారంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. గతంలో ఆయన ఇండియాకు అనేకసార్లు వచ్చాడు. ఇండియాలో ఉన్న పలువురు గురువులను కలిసాడు. బాలీవుడ్ లో కూడా స్టీవెన్ సీగల్ కు సన్నిహితులు ఉన్నారు. ఈ క్రమంలోనే సత్యసాయి బాబాని చిరంజీవి ద్వారా కలిశారు. చిరంజీవి సత్య సాయి బాబా, స్టీవెన్ సీగల్ ఒకే స్టేజిపై కూర్చున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న పాత ఫోటో

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో పాటు, సత్యసాయి బాబా, చిరంజీవి, స్టీవెన్ సీగల్ కలిసి ఉన్న అరుదైన పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినీ, ఆధ్యాత్మిక ప్రపంచాలను కలిపిన ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.