|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ కు కట్టప్ప స్ట్రాంగ్ వార్నింగ్, సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు

Published: 25-06-2025, 9:35 AM
పవన్ కళ్యాణ్ కు కట్టప్ప స్ట్రాంగ్ వార్నింగ్, సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు

తమిళ నటుడు సత్యరాజ్, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మురుగన్ మానాడులో పవన్ చేసిన వ్యాఖ్యలకు సత్యరాజ్ ఘాటుగా స్పందిస్తూ, తమిళనాడులో మతం పేరుతో రాజకీయాలు సాగవని హెచ్చరించారు.

Key Points

1

పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మురుగన్ మానాడులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

2

సత్యరాజ్ పవన్ కళ్యాణ్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

4

ఈ వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీశాయి.

మురుగన్ మానాడులో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ తమిళ సినీ నటుడు, బాహుబలి కట్టప్ప, సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఒక రకంగా పవన్ కు ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తమిళనాడులో మతం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే అటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

రీసెంట్ గా పవన్ కల్యాణ్ తమిళనాడులోని మధురైలో జ‌రిగిన “మురుగన్ మానాడు” అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభలో పవన్ నాస్తికులు, సెక్యులరిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, హిందుత్వం, సనాతన ధర్మం వంటి అంశాలను ప్రస్తావించారు.

పవన్ తన ప్రసంగంలో “నాస్తికులకు ఏ దేవుడినీ నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మన దేశంలో సమస్య ఏమిటంటే, నాస్తికులు ముఖ్యంగా హిందువుల‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర చర్చకు దారితీశాయి.

సత్యరాజ్ తీవ్ర స్పందన

తమిళనాడు మంత్రులు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, పవన్ మతం పేరిట చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై నటుడు సత్యరాజ్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “తమిళనాడులో దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోం. ఇది హిందుత్వాన్ని విస్తరించాలనే దురుద్దేశంతో కూడుకున్న ప్రచారం” అని విమర్శించారు.

“పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను మీరు మోసం చేయలేరు. మురుగన్ సభతో మమ్మల్ని మోసం చేశామని అనుకుంటే అది మీ తెలివితక్కువతనమే అవుతుంది. తమిళ ప్రజలు చాలా తెలివైనవారు. తమిళనాట మీ మత ఆటలు సాగవు తమిళనాడు ప్రజలు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను సహించరని సత్యరాజ్ స్పష్టంగా హెచ్చరించారు.

“మతాన్ని ఉపయోగించి ఓట్లు పొందాలనుకోవడం తమిళ ప్రజలకి నచ్చదు. మేము మూర్ఖులం కాదు. ” అంటూ ఘాటుగా స్పందించారు. ” ఆయన తన అభిప్రాయాన్ని సూటిగా వ్యక్తపరిచారు. సత్యరాజ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ లో ఈ వాఖ్యలు పెద్ద దుమారమే రేపేలా ఉన్నాయి.

తమిళనాడులో రాజకీయ చర్చ

ఇక సత్యరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఇంకా స్పందించలేదు. అయితే, ఈ అంశం సౌత్ ఇండియన్ పాలిటిక్స్ లో కొత్త చర్చకు దారి తీసినట్టు తెలుస్తోంది. హిందుత్వం, నాస్తికత్వం, సనాతన ధర్మం వంటి అంశాల చుట్టూ తమిళనాడులో మతపరమైన రాజకీయాలు తిరిగి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేకులు కొందరు అంటున్నారు.

తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రాజకీయంగా పాగా వేయాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య పవన్ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఇలాంటి విమర్శలు ఎదురవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

మురుగన్ మానాడు సభకు హాజరైన పవన్, తమిళ ప్రజల మద్దతు పొందే లక్ష్యంతో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా వేడెక్కించాయి. తమిళనాడులో పెరియార్ భావజాలం ,సెక్యులర్ విధానాలు ఎక్కువగా ఆచరణలో పెట్టేనాయకులు పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ అంశంపై ఇంకా ఎవరెవరు స్పందిస్తారోన చూడాలి.

సత్యరాజ్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. హిందుత్వం, నాస్తికత్వం చర్చ మరింత ముదిరింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.