
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన OG కామిక్ బుక్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. OG సినిమా కథకు సంబంధించిన ప్రీక్వెల్‌గా జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో పవన్ కళ్యాణ్ చేసే సాహసాలతో ఈ కామిక్ బుక్ రూపుదిద్దుకుంది. దీనిని వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోండి!
Key Points
పవన్ కళ్యాణ్ OG సినిమాకు సంబంధించిన కామిక్ బుక్ రిలీజ్ అయింది.
జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో పవన్ యాక్షన్స్, సుభాష్ చంద్రబోస్ లింక్‌తో కథ ఉంటుంది.
CineViz.co.in వెబ్సైట్లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.
సాధారణ బుక్ ధర రూ. 360, హార్డ్ పేపర్ బుక్ రూ. 600.
OG కామిక్ బుక్ కథాంశం ఏంటి?
OG Comic Book : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమాకు ఎంత హైప్ వచ్చిందో అందరికి తెలిసిందే. దానికి తగ్గట్టే ఇప్పటికే ఈ సినిమా పెద్ద హిట్ అయి ఆల్మోస్ట్ 200 కోట్ల గ్రాస్ దాటేసింది. ఈ సినిమాకు ప్రీక్వెల్, సీక్వెల్ చాలా ప్లాన్స్ ఉన్నట్టు, ఈ సినిమాకు జపాన్ బ్యాక్ డ్రాప్ లో ఇంకా పెద్ద కథ ఉన్నట్టు, సుభాష్ చంద్రబోస్ కి లింక్ ఉన్నట్టు.. డైరెక్టర్ సుజీత్ పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు.(OG Comic Book)
OG రిలీజ్ కి ముందే దీనికి సంబంధించిన ఓ కామిక్ బుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ కామిక్ బుక్ లో పవన్ కళ్యాణ్ జపాన్ లో చేసే యాక్షన్స్ కి సంబంధించిన కథ ఉంటుందని సమాచారం. దీంతో కామిక్ బుక్స్ లవర్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OG కామిక్ బుక్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసారు. తాజాగా ఈ కామిక్ బుక్ రిలీజ్ అయినట్టు, ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొమ్మని దీనికి సంబంధించిన ఓ పవర్ ఫుల్ కామిక్ వీడియోని రిలీజ్ చేసారు నిర్మాణ సంస్థ.
కామిక్ బుక్ ఆర్డర్, ధర వివరాలు
Also See : CM Chandrababu Naidu : జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు..
ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ జపాన్ యోధుడిగా ఫైట్స్ చేసినట్టు చూపించారు. చివర్లో సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నట్టు చూపించారు. ఈ కామిక్ బుక్ కథ, డిజైన్, డైరెక్షన్ అంతా సుజీత్ చేసాడు. అయితే దీన్ని బుక్ రూపంలో సినీ విజ్ అనే కంపెనీ మార్చింది. ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు https://cineviz.co.in/store ఈ లింక్ ఓపెన్ చేసి కొనుక్కోవచ్చు.
ఫ్యాన్స్‌కు పవన్ కళ్యాణ్ కామిక్ ట్రీట్
OG కామిక్ బుక్ మాములు పేపర్ బుక్ అయితే 360 రూపాయలు, హార్డ్ పేపర్ తో చేసిన బుక్ అయితే 600 రూపాయలు ధర ఉన్నట్టు ప్రకటించారు. ఇది ఆ వెబ్ సైట్ లో ఆర్డర్ చేసుకుంటే అక్టోబర్ 2 తర్వాత డెలివరీ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం కామిక్ బుక్స్ లవర్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OG కామిక్ బుక్ ని ఆర్డర్ చేసేసుకోండి.
OG కామిక్ బుక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు, కామిక్ బుక్స్ లవర్స్‌కు ఒక అద్భుతమైన ట్రీట్. సినిమా కథాంశంలోని లోతైన వివరాలను తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఇంకెందుకు ఆలస్యం? మీ కాపీని ఇప్పుడే ఆర్డర్ చేసుకొని, పవర్ స్టార్ ప్రపంచంలోకి అడుగుపెట్టండి!


