|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Official: పవన్ కల్యాణ్ OG మూవీ నుంచి బిగ్ అప్డేట్

Published: 11-07-2025, 9:57 AM
Official: పవన్ కల్యాణ్ OG మూవీ నుంచి బిగ్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘OG’ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.

Key Points

1

పవన్ కల్యాణ్ OG సినిమా షూటింగ్ పూర్తయింది.

2

దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల.

4

పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు.

OG సినిమా షూటింగ్ పూర్తి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అప్‌‌కమింగ్ మూవీస్‌లో ఓజీ(OG Movie) ఒకటి. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజిత్(Director Sujith) తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తుండగా, ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ మొత్తం పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మరో క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘షూటింగ్‌ పూర్తయింది. ఇక థియేటర్లలో విడుదల కావడమే తరువాయి. ఓజీ మీ అందరినీ ఆశ్చర్యపరచబోతోంది’ అని క్యాప్షన్ ఇచ్చారు.

ఇందులో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌లే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇందులో పవన్ ప‌వ‌ర్‌ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియో సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ‘ఓజీ’పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

దసరా కానుకగా విడుదల తేదీ

నటీనటుల వివరాలు

పవన్ కల్యాణ్ అభిమానులకు OG సినిమా ఒక గొప్ప దసరా కానుకగా ఉండబోతోంది. చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల అవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.