|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓజీ షూటింగ్: ముంబైలో స్టైలిష్ లుక్‌లో పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్

Updated: 28-05-2025, 8:27 AM
ఓజీ షూటింగ్: ముంబైలో స్టైలిష్ లుక్‌లో పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. చిత్రీకరణ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Key Points

1

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

2

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు.

4

సెప్టెంబర్ 25న దసరా కానుకగా సినిమా విడుదల కానుంది.

ముంబైలో జరుగుతున్న ‘ఓజీ’ చిత్రీకరణ

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. ఇక ఆ చిత్రాన్ని దర్శకుడు సుజిత్(Sujith) తెరకెక్కిస్తుండగా పూర్తి క్రైమ్ త్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై దానయ్య(Danayya) ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ(Imran Hashmi) విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

కాగా ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సెప్టెంబర్ 25న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈ మూవీకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓజీ సినిమా షూటింగ్ ప్రజెంట్ ముంబైలో జరుగుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు. కార్ ఎక్కేటప్పుడు ఇచ్చిన ఫైనల్ టచ్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

స్టైలిష్ లుక్‌లో పవన్ కళ్యాణ్

వైరల్ అవుతున్న వీడియో

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ వీడియో ఆనందాన్నిచ్చింది. ‘ఓజీ’ సినిమా దసరా కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ వైరల్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.